No role in deciding state capital: Centre tells Andhra HC మా పరిధిలోనిది కాదు: రాజధానిపై మరోమారు కేంద్రం..

No role in deciding state capital centre tells andhra pradesh high court

High Court bench, Amaravati, Capital, CRDA, Justice Rakesh Kumar, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Ministry of Home Affairs

The Centre has conveyed to the Andhra Pradesh High Court once again that it has no role to play in deciding the capital city of a state. The Ministry of Home Affairs said this in a counter-affidavit filed in response to a High Court notice while hearing petitions challenging the state government's move to trifurcate the state capital.

రాజధానిపై హైకోర్టుకు కేంద్రం మళ్లీ అదే మాట.. ‘‘సుప్రీం’’లో విచారణ వాయిదా

Posted: 08/19/2020 09:21 PM IST
No role in deciding state capital centre tells andhra pradesh high court

రాజధాని విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానంలో మరోమారు తన వాదనను వినిపించింది కేంద్రం. ఈ విషయంలో ప్రభుత్వానికి, అమరావతి జేఏసీ నేతలకు మధ్య నడుస్తున్న కేసు నేపథ్యంలో కేంద్రం హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి మరోమారు న్యాయస్థానానికి క్లారిటీగా తమ వాదనను వినిపించారు. ఈ సందర్భంగా గతంలో చెప్పిన విషయాలను మరోమారు వెల్డడించారు. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ వాదనను వినిపించింది, ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా పునరుద్ఘాటించింది. కాగా, ఇటీవల ఏపీ గవర్నర్ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హైకోర్టు స్టే కొనసాగుతోంది. ఈ నెల 27 వరకు ఈ రెండు బిల్లులపై స్టే కొనసాగుతుందని ఈ నెల 14 హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ఏర్పాటు అంశం తమ పరిధిలోనిది కాదని మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఈ నెల 28న మరోమారు రాష్ట్ర హైకోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో రాజధాని అంశంతో పాటు సీఆర్డీఏ అంశంపై కూడా ఆసక్తి నెలకోంది.

రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..

 

ఆంధ్రప్రదేశ్ లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ మళ్లీ వాయిదా పడింది. జస్టిస్‌ నారీమన్‌ ధర్మాసనం .. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. రాజధాని రైతులు, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినకముందే కోర్టులో చోటు చేసుకున్న ఒక పరిణామంతో ఈ కేసును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్‌ నారీమన్‌ ధర్మాసనం తెలిపింది. ఈకేసు మరో బెంచ్‌కు పంపాలని జస్టిస్‌ నారీమన్‌ .. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజధాని కోసం 33వేల ఎకరాల భూమి ఇచ్చామని, అమరావతి నుంచి రాజధాని మార్చి తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles