Inhaling hot water steam gives relief from coronavirus ఆవిరితో కరోనా ఆవిరి.. మందులతో పూర్తి విముక్తి

Inhaling hot water with steam tablets gets relirf from coronavirus

coronavirus India, coronavirus rumours, covid 19 rumours, Novel Coronavirus rumours, hot water steam, inhale steam, coronavirus relief, coronavirus, covid 19

Amid the message doing rounds on social media that inhaling hot water steam can kill coronavirus, there is no scientific evidence to prove that its true, but home quarantine patients say that they got relief from inhaling hot water with steam tablets.

వేడినీళ్ల ఆవిరితో కరోనా ఆవిరి.. మందులతో పూర్తి విముక్తి

Posted: 08/18/2020 02:03 AM IST
Inhaling hot water with steam tablets gets relirf from coronavirus

కరోనా వైరస్ నుంచి ఊరట పొందాలంటే తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలి. వారి చెప్పిన విధంగా మందులు వేసుకోవడం తప్పనిసరి. అయితే అనేక మంది హోం క్వారంటైన్ లో వున్న బాధితులు అవిరితో కరోనాను ఆవిరియ్యేట్టు చేశారని తాజాగా వైద్యుల పరిశీలనలో తేలింది. ఒక క్రమపద్ధతిలో రోజూ మూడుసార్లు ఆవిరి పట్టుకొంటే చాలా వరకు ప్రయోజనం ఉంటోందని తేలింది. ఇలా చేస్తూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్న వారు త్వరగా కోలుకుంటున్నట్లు హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స అందించే ప్రధాన వైద్యుడి పరిశీలనలో స్పష్టమైంది.

గ్రేటర్‌ హైదరాబాదు వ్యాప్తంగా ప్రస్తుతం 20 వేల మంది వరకు కరోనా బాధితులు ఉండగా 15 వేల మందికి పైగా ఇంట్లోనే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషనో వున్న వారు ప్రతిరోజు వైద్యుల సూచనల మేరకు రోజుకు మూడు పూటలా అవిరి పట్టుకోవడంతో కరోనా నుంచి వేగంగా కోలుకున్నారని వైద్యుల పరిశీలనలో స్పష్టమైంది. దీనికి తోడు వైద్యులు సూచించిన మందులు తీసుకోవడంతో పాటు పండ్లు మరీ ముఖ్యంగా బత్తాయి, నారింజ సహా ఆపిల్, దానిమ్మను తీసుకోవడంతో వేగంగా కరోనా నుంచి విముక్తులు అవుతూ.. నెగిటివ్ రిపోర్టు తెచ్చుకుంటున్నారు.

అయితే హోం ఐసోలేషన్ లోని వారికి వైద్యసాయం సరిగా అందడం లేదని కూడా వీరి పరిశీలనలో బయటపడిందని సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, స్నేహితుల సలహాలు సూచనల ఆధారంగా కొందరు వైద్యం చేసుకుంటున్నారు. కొందరు అతిగా కషాయం తాగుతుండగా, మరికొంతమంది ఇష్టానుసారం మందులు వాడేస్తున్నారు. అప్పటికే చాలామంది ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్‌ వెళ్లకుండా అడ్డుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి మరీ విషమిస్తే న్యూమోనియాకు దారితీస్తోంది. ఇలాంటి వారికి తొలుత ఆక్సిజన్‌ తరువాత వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోంది.

కరోనా సోకిన వారు ఆది నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడడంతోపాటు రోజూ మూడు పూటలా 15 నిమిషాలపాటు ఆవిరి పడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. పాత్రలో మరిగించిన నీటిలో ట్యూబ్‌ మందు గానీ పసుపు గానీ వేసి పావు గంట సేపు ఆవిరి పీల్చాలని సూచిస్తున్నారు. తద్వారా రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. శ్వాస ప్రక్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ తొలగిపోతుంది. ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles