Russia says 20 countries have pre-ordered a billion doses కోవిడ్-19 వాక్సీన్ కు గిరాకీ.. క్యూకట్టిన 20 దేశాలు.!

Worlds first covid 19 vaccine russia says 20 countries have pre ordered a billion doses

Vladimir Putin, COVID-19 Vaccine, Russia, russia vaccine, covid-19 vaccine, world's first coronavirus vaccine, Putin, covid 19 vaccine, vaccine for covid-19, russia covid vaccine, russia corona vaccine news, covid vaccine russia, russia vaccine for covid 19, russia covid-19 vaccine

Russia's first coronavirus vaccine 'Sputnik V' is developed jointly by Gamaleya Research Institute and the Russian Defence Ministry, which industrial production was expected from September and that 20 countries had made 'preliminary applications for over one billion doses' of the vaccine, according to reports.

రష్యా కోవిడ్ వాక్సీన్ కు గిరాకీ.. క్యూకట్టిన 20 దేశాలు.!

Posted: 08/12/2020 10:42 PM IST
Worlds first covid 19 vaccine russia says 20 countries have pre ordered a billion doses

కరోనా వైరస్‌ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని రష్యా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్ ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని.. అయితే పలు దేశాలను రవాణా చేసేందుకు వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తన ఉత్పత్తిని ప్రారంభిస్తామని కూడా అంటోంది. వివిధ దేశాలకు లక్షలాది డోసుల ‘స్పుట్‌నిక్‌ వీ’ను సరఫరా చేస్తామని తెలిపారు. గామలేయా ఇనిస్టిట్యూట్‌ సహా రష్యా డిఫెన్స్ శాఖ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే దీని పట్ల ఆచితూచి వ్యవహరించాలని ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ అన్నారు.

ఈ వ్యాక్సిన్‌ను వాడే ముందుగా ఇది సురిక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగివుందా అనేది పరిశీలించాలని పేర్కొన్నారు. ఆయన ఒక్కరే కాదు అనేక మంది రష్యా వ్యాక్సిన్‌ స్పుట్‌నిక్‌ వీ పై అనుమానాలను వ్యక్తం చేస్తూనే వున్నారు. ఇదిలావుండగా రష్యా తయారుచేసిన తొలి వాక్సీన్ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఏకంగా 20 దేశాలు ముందస్తు ఆడర్ల కోసం ఒప్పందాలను ఇచ్చాయని రష్యా వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్ ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్ కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ తెలిపారు.

ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ బుధవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. అలాగే, పరిశ్రమల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మాత్రం సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌పై విదేశాలు ఆసక్తి చూపుతున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ పొందేందుకు ఇప్పటికే 20 దేశాల నుంచి దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. విదేశీ భాగస్వాములతో కలిసి రష్యా ఏడాదికి 500 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను ఐదు దేశాల్లో ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vladimir Putin  Corona Vaccine  COVID-19 Vaccine  Russia  vaccine for covid-19  coronavirus  russia  

Other Articles