'Good day for our country': Democrats hail Kamala Harris as VP pick అగ్రరాజ్య ఉపాధ్యక్ష పదవి బరిలో ఇండో-అమెరికన్

Democrat joe biden chooses senator kamala harris for white house running mate

who is kamala harris,vice presidential candidate democrats,US vice presidential candidate democrats,us elections 2020,Kamala Harris,Joe Biden,Donald Trump,Donald Harris

Democratic presidential candidate Joe Biden on Tuesday picked Senator Kamala Harris as his choice for vice president, making her the first Black woman on a major-party US presidential ticket and giving him a partner well prepared to go on the attack against Republican President Donald Trump.

అగ్రరాజ్య ఉపాధ్యక్ష పదవి బరిలో ఇండో-అమెరికన్.. కమలా హారిస్

Posted: 08/12/2020 01:55 PM IST
Democrat joe biden chooses senator kamala harris for white house running mate

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన మహిళకు అత్యున్నత గౌరవం దక్కింది. డెమెక్రాట్ పార్టీ నుంచి అమె అత్యున్నత స్థాయి పదవి బరిలో నిలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్‌ పార్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్‌.. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు.

కమలా హారిస్‌ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమోక్రట్‌  పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. జో బిడెన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. కమలా హారిస్‌ ఎంపికను జో బిడెన్‌ ట్విటర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు. తామిద్దరం కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించబోతున్నామన్నారు. అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కమలా హారిస్‌ తనకు చక్కని భాగస్వామి అని అభివర్ణించారు. తన ఎంపికపై స్పందించిన కమలా హారిస్‌ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. కమలా హారిస్‌ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్‌ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles