Trump Evacuated During Presser After Shooting వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల కలకలం.. ట్రంప్ ప్రెస్ మీట్లో అంతరాయం..

Donald trump briefly evacuated during presser after shooting outside white house

Donald Trump, White House, US, US white house shootinng, security guards, miscreant, armed miscreant, President Trump, press conference, secret service agents

Secret Service guards shot a person, who was apparently armed, outside the White House, President Donald Trump said just after being briefly evacuated in the middle of a press conference. The president was abruptly ushered out of the press event and black-clad secret service agents with automatic rifles rushed across the lawn north of the White House.

వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల కలకలం.. ట్రంప్ ప్రెస్ మీట్లో అంతరాయం..

Posted: 08/11/2020 02:43 PM IST
Donald trump briefly evacuated during presser after shooting outside white house

(Image source from: Twitter.com/Reuters)

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భద్రత అంశం కూడా మరోమారు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పులు పెను కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డ్స్‌ సదరు వ్యక్తి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు శ్వేతసౌధ భద్రతా వర్గాలు వెల్లడించాయి.

కాగా వైట్‌హౌజ్‌ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్‌ ప్రెస్ ఈవెంట్‌ మధ్యలోనే ఆపివేసి తన కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు. పరిస్థితి చక్కబడగానే మళ్లీ విలేకరుల ఎదుటకు వచ్చిన ట్రంప్‌.. వైట్‌హౌజ్‌ పరిసరాల్లో సంచరిస్తూ భద్రతకు భంగం కలిగించిన ఓ వ్యక్తిపై సీక్రెట్‌ సర్వీసెస్‌ గార్డ్స్‌ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. చట్టప్రకారమే సాయుధుడైన దుండగుడిపై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘‘వాళ్లు అత్యద్భుతమైన వ్యక్తులు. వాళ్ల సేవల పట్ల సంతోషంగా ఉన్నాను. ఎంతో భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నాను’’ అని సత్వరమే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డులపై ప్రశంసలు కురిపించారు.

అదే విధంగా ఘటనపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలోని ప్రతీ మూల ఏదో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది కదా’’ అని సమాధానమిచ్చారు. ఇక ఈ విషయం గురించి వైట్‌హౌజ్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఫిలిపోస్‌ మెలాకు అనే వ్యక్తి మాట్లాడుతూ.. సాయంత్రం 5.50 గంటలకు తనకు కాల్పుల శబ్దం వినిపించిందని, అయితే అంతకంటే ముందే ఓ అరుపు విన్నానని తెలిపారు. అది కచ్చితంగా మగ గొంతేనని, దాదాపు తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డులు అతడి వైపుగా పరిగెత్తుకు వచ్చారని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  White House  US  US white house shootinng  security guards  armed miscreant  

Other Articles