యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల 32 వేల మందిని కబళించి వేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిఫుణులు, అనేక మంది ప్రముఖులను కూడా కబళించింది. ఎందరెందరో నటులు, వివిధ దేశాల రాజకీయ నేతలను కూడా కరోనా కబళించి వేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రెండు కోట్ల మందికి పైగా కరోనా భారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటు మన దేశంలోనూ పలువురు ప్రముఖులు కరోనా భారిన పడ్డిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, సహా పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడి అసువులు బాసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులు కూడా కొవిడ్-19 బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
వేరే పరీక్షల కోసం తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా ఐసొలేషన్లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్లో ఉంటూ ప్రణబ్ ముఖర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more