Kerala plane crash: toll raises to 19 కోజికోడ్ విమాన ప్రమాదం: 19కి చేరిన మృతుల సంఖ్య

Black box recovered from crashed air india express flight in kerala

Air India Express crash, Kozhikode, black boxes, Dubai, Air India Express, kerala plane crash, kozhikode plane crash, Air India Flight IX-1344, kerala

The black box of the Air India Express flight that crashed at Kerala's Kozhikode airport has been found. Flight IX-1344, carrying 184 people, including passengers and crew from Dubai, broke up into pieces after skidding off a tabletop runway amid heavy rain and hurtling down a valley at 7.41 PM. At least 19 people, including both pilots, were killed and 127 others injured.

కోజికోడ్ విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ స్వాధీనం.. 19కి చేరిన మృతుల సంఖ్య

Posted: 08/08/2020 02:15 PM IST
Black box recovered from crashed air india express flight in kerala

(Image source from: Twitter.com/ANI)

కేరళలోని కోజికోడ్‌ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 19కి పెరిగిందని తాజాగా పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారి సంఖ్య కూడా 170కి పైగానే వుందని.. క్షతగాత్రులందరినీ కోజికోడ్ చుట్టుపక్కల 13 వేర్వేరు ఆసుపత్రుల్లో 171 మంది చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వీరిలో గర్భిణీ స్త్రీ, నలుగురు పిల్లలతో సహా మొత్తం 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దర్ఘటనలో మరణించిన 19 మందిలో 18 మందిని గుర్తించగా.. ఇంకొకరిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.  

ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయానికి విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతులకు  కోవిడ్ -19 ప్రొటోకాల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ మార్టం చేయనున్నారు. గమ్యస్థానానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హోరున కురుస్తున్న భారీ వర్షంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో పైలట్లు తడబాటుకు గురయ్యారని, దీంతో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలోకి వెళ్లడం వల్ల్లే ప్రమాదం సంభవించిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి,

ల్యాండింగ్ సమయంలో తొలుత ఓ వైపు నుంచి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడని, అయితే అది కుదరకపోవడంతో మరోమారు మరోవైపు నుంచి విమానాన్ని ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని స్వీడిష్ ప్లయిట్ ట్రాకర్ ప్లయిట్ రాడర్ 24 సంస్థ తెలిపింది, ఇక అది టేబుల్ టాప్ రన్ వే కావడంతో కోజికోడ్ విమానాశ్రయం రన్ వే జాగ్రత్తగా వ్యవహరించి ల్యాండింగ్ చేయాల్సి వుంటుందని అన్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. వీరితో కలిపి మొత్తంగా 19 మంది అసువులు బాసారిన విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ రెండు దర్యాప్తు బృందాలతో విచారణకు అదేశించింది. డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ డిజీసిఐ వాచ్ డాగ్ చేత ఒక విచారణ కమిటీని వేయడంతో పాటు మరో బందంతో దర్యాప్తును చేపట్టింది. కాగా ఇప్పటికే రంగంలోకి దిగిన ఈ బృందాలు కోజికోడ్ చేరకుని విచారణను ప్రారంభించాయి, వాటిలో తొలుత వచ్చిన ఓ బృందం ఇప్పటికే ప్రమాదం సంభవించిన ప్రాంతానికి చేరుకుని విమాన బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకుంది. విమాన ప్రమాదానికి గల కారణాలు, పైలట్ల సంభాషణలు కూడా బ్లాక్ బాక్సులో రికార్డు అవుతాయి, దీంతో ప్రమాదానికి కారణాలను ఈ కోణంలోనూ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది దర్యాప్తు బృందం.

ఘటనాస్థలికి కేరళ సీఎం

 

విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మరికాసేపట్లో కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుని.. ప్రమాదం గురించి అధికారులతో చర్చించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ‌న్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికుల బంధువులు సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌(0495-2376901) ఏర్పాటు చేసినట్లు కొలికోడ్‌ కలెక్టర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh