Judge, Son Died Allegedly After Eating Poisoned Chapatis చపాతీలు తిని న్యాయమూర్తి మృతి.. మహిళ అరెస్టు..

Woman in mps betul plotted murder of judge and family gets arrested

Mahendra Tripathi, Madhya Pradesh Police, Judge and Son Killed, Additional district judge, Betul, Murder, Woman, Tantrik woman, NGO, POison, Wheat Flour, Madhya Pradesh, crime

Police in Betul district of Madhya Pradesh arrested six people including a woman on Wednesday for allegedly killing an additional district and sessions judge (ADJ) and his 33-year-old son and also attempting to kill the judge’s wife and another son by mixing poison in flour.

చపాతీలు తిని న్యాయమూర్తి మృతి.. మహిళ అరెస్టు..

Posted: 07/31/2020 12:25 AM IST
Woman in mps betul plotted murder of judge and family gets arrested

విషపూరిత చపాతీలు తిని ఓ న్యాయమూర్తి ప్రాణాలు వదిలారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వీరిద్దరి మరణానికి కారణమైన ఓ మహిళను కీలక సూత్రధారిగా అనుమానించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అమెతో పాటు అమెకు సహకరించిన మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే న్యాయమూర్తికి తన ఆరోగ్య అకస్మాత్తుగా విషమం కావడానికి కారణం అదేనని అనుమానించి తన చిన్నకుమారిడితో చెప్పిన విషయమే పోలీసులు కేసును చేధించడానికి కూడా కారణమైంది. తన జీవితంలో తనను హత్యకు కారణమైన వ్యక్తికి కూడా న్యాయమూర్తి శిక్షించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

బేతుల్‌ ఎస్‌పీ సిమలా ప్రసాద్‌ కథనం ప్రకారం, మధ్యప్రదేశ్ లోని బేతుల్‌ జిల్లా అడిషినల్‌ సెషన్స్‌ జడ్జీగా ఉన్న మహేంద్ర త్రిపాఠికి, ఛింద్వారాకు చెందిన స్వచ్చంధ సంస్థ నిర్వాహకురాలు సంధ్యాసింగ్(45)‌ తో స్నేహం ఏర్పడింది. బేతుల్ కు ముందు న్యాయమూర్తి మహేంద్ర త్రిపాఠి కూడా చింద్వారాలోనే పనిచేయడంతో వీరిద్దరి మధ్య స్నేహం పెనవేసుకుంది. కొంతకాలం తరువాత త్రిపాఠికి బేతుల్ కు బదిలీ అయ్యారు. అనంతరం ఆయన భార్యాపిల్లలు కూడా అతని దగ్గరకు చేరుకున్నారు. దీంతో త్రిపాఠికి సంద్యాసింగ్ కు మధ్య అగాధం ఏర్పడింది. దీంతో నాలుగు నెలలుగా మహేంద్ర సింగ్‌ను కలవడం సాధ్యపడని సంధ్యాసింగ్‌.. అతనిపై కక్ష పెంచుకుని అంతం చేయాలని పథకం వేసింది.

ఇద్దరి మధ్య స్నేహం కుదిరిన నేపథ్యంలో న్యాయమూర్తి త్రిపాఠి తన సమస్యలను అమెకు చెప్పుకున్నాడు. అయితే వాటినే ఆసరగా చేసుకున్న సంధ్యాసింగ్‌ ఆయన సమస్యలన్నీ తొలగిపోవడానికి ఓ మార్గం వుందని త్రిపాఠితో నమ్మబలికింది. తాను ఓ ప్రత్యేక పూజ నిర్వహిస్తానని దాంతో సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పింది. దీనికోసం గోధుమ పిండి తీసుకురమ్మని అడిగింది. త్రిపాఠి తెచ్చిన గోధుమ పిండిలో విషం కలిపిన సంధ్యాసింగ్.. మరుసటి రోజును అతనికి గోదుమపిండిని తిరిగిఇచ్చి.. పూజలో పెట్టిన పిండి కాబట్టి దానితో చపాతీలు చేసుకుని తినమని.. అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పింద. అమె చెప్పిన మాటలను నమ్మిన త్రిపాఠి చపాతీలు చేయించుకుని తిన్నారు.

అతనితో పాటు అతని పెద్ద కుమారుడు కూడా అవే చపాతీలు తినడంతో వెంటనే వాంతులు అయ్యాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తండ్రీ కుమారులు రెండురోజుల క్రితం మరణించారు. త్రిపాఠి భార్య మాత్రం చపాతీలు తినకపోవడంతో గండం నుంచి బయటపడింది. ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో గోధుమ పిండి విషయాన్ని త్రిపాఠి అతని చిన్నకుమారుడికి తెలిపారు. ఈ సమచారం పోలీసులకు తెలియజేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. చివరకు సంధ్యాసింగ్‌ను అరెస్టు చేసి విచారించడంతో కుట్ర విషయం బయటపడింది. సంధ్యాసింగ్‌తో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Additional district judge  Betul  Murder  Woman  Tantrik woman  NGO  POison  Wheat Flour  Madhya Pradesh  crime  

Other Articles