Study reveals Covid-19 can infect ears బీ అలెర్ట్ : చెవుల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి.!

Now cover your ears too as covid 19 can infect through ears study

covid19, coronavirus, JAMA, ear infection, coronavirus research, covid19 study, coronavirus latest update, mastoid, hollow bone, middle ear, scientific journal JAMA, Ear

A recent study suggests that the virus can infect the ear as well. The study, which was published in the scientific journal JAMA, was based on the autopsy carried out on three patients who died from Covid-19. The findings revealed the virus’ presence inside the middle ear and in the mastoid area of the head.

బీ అలెర్ట్ : చెవుల ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమణం.!

Posted: 07/25/2020 11:05 PM IST
Now cover your ears too as covid 19 can infect through ears study

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ఉనికిని చాటుకుంటూ అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని ఏకంగా రెండు వందలకు పైగా దేశాలలో తన ఉద్దృతిని కోనసాగించి ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల మందిని కబళించివేసింది. దీంతో యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా పేరు చెప్పగానే భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడి నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో కనిపించని శత్రువుతో ప్రపంచ ప్రజలు యుద్దం చేస్తున్నారు. పలు దేశాలు లాక్ డౌన్ అంటూ ప్రజల జీవనాన్ని స్థంభింపజేశాయి. దీంతో అనేక మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా వైరస్‌ప్రభావంతో బయటకు వెళ్లిన వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధన కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు ప్రభుత్వాలు పెట్టాయి.

ఇక మరికోన్ని దేశాల్లో మాస్క్ దరించకపోతే వెయ్యి రూపాయల జరిగానాలు కూడా విధించాయి, ఈ నేపథ్యంలో ఎన్ 85, డబ్యూ 95, ఎన్ 35 ఇలా అనేక మాస్క్ లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే కేవలం చేతులు కడుక్కోవడం, శాసిటైజర్లు రాసుకోవడంతో మాస్క్ లు ధరించడంతో కరోనానను అడ్డగించిన అది కొంతవరకు మాత్రమేనని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కరోనా వైరస్ కేవలం ముక్కు, నోటి, కళ్ల ద్వారా మాత్రమే వ్యక్తుల నుంచి వ్యక్తులకు సంక్రమిస్తుందని మాత్రమే తెలిసిన మనకు ఇక మరో మార్గం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అదే కర్ణములు (చెవులు).

ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్ జామా (జేఏఎంఏ)లో ప్రచురితమయ్యాయి. కొవిడ్-19 కారణంగా మృత్యువాత పడిన ముగ్గురు వ్యక్తులపై జరిపిన ఈ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. వారి మధ్య చెవి లోపల, తల మాస్టాయిడ్ ప్రాంతంలో వైరస్ ఉనికిని గుర్తించారు. మాస్టాయిడ్ అనేది చెవి వెనక ఉన్న ఓ బోలు ఎముక. మృతదేహాల నుంచి మాస్టాయిడ్లను తొలగించి, వారి మధ్య చెవుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షించగా ఈ విషయాలు వెల్లడైనట్టు అధ్యయనకారులు తెలిపారు. ‘‘సార్స్-కొవ్-2 వైరస్ ఉనికి మధ్య చెవి, మాస్టాయిడ్‌లో ఉన్నట్టు అధ్యయనంలో స్పష్టమైంది’’ అని అధ్యయనం వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles