AIIMS begins phase-1 clinical trials for Covaxin భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పై ఎయిమ్స్ గుడ్ న్యూస్..

Covid 19 vaccine trial at aiims delhi 30 year old gets shot no side effects so far

coronavirus vaccine, Centre for Community Medicine, covid 19 vaccine, Covaxin,Covaxin update, covid 19 vaccine in india, india coronavirus vaccine, covid 19 vaccine update, covid 19 vaccine news, covaxin trial at AIIMS, covaxin results, covaxin launch date, covaxin human trial, corona vaccine, COVID-19 vaccine, AIIMS, Bharat biotech, Delhi, Dr Sanjay Rai, AIIMS Professor

The Phase-1 Human Clinical Trials for Covaxin, vaccine candidate from India for COVID-19, has started at All India Institutes of Medical Sciences (AIIMS), Delhi. 'The first dose of 0.5 ml intramuscular injection was given to him around 1.30 pm. No immediate side-effects have been observed so far. He was under observation for two hours and will be monitored for the next seven days,' Dr Sanjay Rai, Professor at the Centre for Community Medicine at AIIMS said.

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పై ఎయిమ్స్ గుడ్ న్యూస్.. క్లినికల్ ట్రయల్స్ షురూ

Posted: 07/25/2020 02:40 PM IST
Covid 19 vaccine trial at aiims delhi 30 year old gets shot no side effects so far

భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కరోనా వ్యాక్సీన్‌ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ లోని నిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైన తరువాత ఇక తాజాగా ఢిల్లీలోని ఏయిమ్స్ అసుపత్రిలో కోవాగ్జిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా భారత్ కు చెందిన తొలి దేశీయ వాక్సీన్ ను రూపోందించిన భారత్ భయోటెక్ కోవాక్జీన్ ను ప్రయోగ ఫలితాలను అక్కడి అధికారులు వెల్లడించారు. సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిస్ ఫ్రోఫెసర్ సంజయ్ రాయ్ పర్యవేక్షలో సాగిన ఈ హ్యూమన్ ట్రాయల్స్ పై ఆయన గుడ్ న్యూస్ పంచుకున్నారు.

వాక్సీన్ కు భారత డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ (డీసీజీఐ) అనుమతులు జారీ చేసిన నేపథ్యంలో నిమ్స్ తరువాత ఎయిమ్స్ లో మనుషులపై ట్రయల్స్ కోనసాగుతున్నాయి. తొలుత‌ 30 ఏళ్ల వ్యక్తికి టీకాలు వేయ‌గా, అత‌నిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. రెండు గంటల తరువాత అతనిని ప‌రీక్షించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడుతూ కోవాక్సిన్ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయ‌ని, క్ర‌మ‌క్ర‌మంగా అధిక‌సంఖ్య‌లో వాలంటీర్ల‌కు టీకాల ప‌రీక్ష జ‌ర‌ప‌నున్నామ‌ని తెలిపారు. ఇప్పటివరకు 12 మందికిపైగా వాలంటీర్లకు మెడికల్ ఫిట్‌నెస్ లభించింద‌ని, వారిలో ఇద్దరిని పిల‌వ‌గా, ఒక వాలంటీర్ వ్యక్తిగత కారణాల వల్ల ఎయిమ్స్‌కు చేరుకోలేకపోయార‌న్నారు.

దీంతో ఒక్క వాలంటీర్ పైనే టీకాను ట్రయల్ చేశామని, అతడికి ఒక్కడికే ఒక టీకా మాత్రమే ఇవ్వగ‌లిగామ‌న్నారు. ట్రయల్స్ విష‌యంలో ఆరోగ్య భ‌ద్ర‌త చాలా ‌ప్ర‌ధాన‌మ‌ని, అందుకే టీకా వేసిన వ్య‌క్తిని రెండు గంట‌ల‌పాటు ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. వారికి ఎటువంటి అనారోగ్య‌‌ సమస్య లేద‌ని తేలిన త‌రువాతే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తున్నామ‌న్నారు.  కాగా తొలుత 50 మందికి టీకాలు వేయ‌నున్నామ‌ని, ఈ వ్యాక్సిన్ రెండు మోతాదులలో ఇస్తామ‌న్నారు. మొద‌టి డోసు ఇచ్చిన వారికి, 14 రోజుల తరువాత రెండవ మోతాదు ఇవ్వనున్నామ‌న్నారు. కాగా ఈ టీకాలను ఈరోజు మ‌రో న‌లుగురికి వేయ‌నున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు తమ ప్రయత్నం కొనసాగిస్తామన్నారు. వాక్సీన్ ను ఐదు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఉంటాయన్నారు. ఎయిమ్స్ లో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇతర దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తయ్యాయి. రష్యా, చైనా, యూకె, లండన్లో సెప్టెంబర్‌ వరకు ట్రయల్స్‌ పూర్తవుతాయి. కాగా అక్టోబర్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ తీసుకొస్తామని భారత్‌ బయోటెక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జంతు జీవాలపై విజయవంతంగా పనిచేసిన ఈ వాక్సీన్.. ఇవాళ మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles