84 people test positive at TN RajBhavan తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం.. 50శాతం సిబ్బందికి పాజిటివ్

84 staff members at tamil nadu raj bhavan test positive for coronavirus

TN RajBhavan, Tamilnadu RajBhavan, Coronavirus In Tamilnadu Rajbhavan, Tamilnadu fights corona, chennai coronavirus latest updates, chennai raj bhavan coronavirus, tamil nadu coronavirus latest updates, Tamil Nadu

A total of 84 people have tested positive for COVID-19 at Raj Bhavan, the official residence of the Governor of Tamil Nadu. 84 out of 147 people working in Raj Bhavan, including four police officers and firefighters have been affected by the virus.

తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం.. 50శాతం సిబ్బందికి పాజిటివ్

Posted: 07/23/2020 03:54 PM IST
84 staff members at tamil nadu raj bhavan test positive for coronavirus

భారత దేశంలో కరోనావైరస్ కొరలు చాస్తోంది. చిన్నా పెద్దా.. పేదా ధనికా అని తేడా లేవీ లేకుండా అందిరినీ వణికిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖుల్లో కూడా కోవిడ్-19 పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం రేపింది. రాష్ట్ర గవర్నర్ అధికార నివాసంలో ఏకంగా 84 మందికి కరోనా వైరస్ పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. రాజ్ భవన్ లో పనిచేస్తున్న మొత్తం 147 మందిలో యాభై శాతానికి పైగా సిబ్బంది కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన వారిలో అధికశాతం భద్రతా బలగాలు, అగ్నిమాపక దళ బృందాల సభ్యులు వున్నారు.

వీరిలో ఎవరు కూడా గవర్నర్‌తో కానీ లేదా రాజ్ భవన్ లోని సీనియర్ ఉద్యోగులతో కానీ కాంటాక్ట్‌‌లోకి రాలేదు అని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. కొంత మందిలో కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు, కాగా వారిలో 84 మందికి కోవిడ్-19 నిర్ధారణ జరిగింది అని రాజ్‌భవన్ తెలిపింది. ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోనావైరస్ సోకిన వారు ఎవరూ గవర్నర్ ను కాంటాక్ట్ కాలేదని, దీంతో గవర్నర్ సురక్షితంగా వున్నారని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం రాజ్ భవన్‌ను శానిటైజ్ చేస్తున్నారని తెలిపారు అధికారులు.

ఇక దేశంలో తమిళనాడులో కరోనా విజృంభన కోనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా ఆరు వేల మార్కు చేరులో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రప్రధమం. ఏకంగా 5849 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 74 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వున్నారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏకంగా లక్షా 86 వేల 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఇక ఏకంగా 522 మంది గడిచిన 24 గంటల్లో మరణించారని తెలిపింది. వీరిలో 444 మరణాలను గతంలో మరణించారని, వారి మరణాల సంఖ్యను సవరించడంతో తమిళనాడులో ఈ మేర మరణాలు సంభవించాయని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles