Rain Lashed Over Hyderabad and other districts in Telangana హైదరాబాద్ పరిసర ప్రాంత జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షం..

Monsoon picks up pace across telangana heavy rains in hyderabad

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

With the Southwest Monsoon intensifying across Telangana, different parts of the city have been receiving heavy rainfall since Wednesday night. After recording a rainfall of 18.9 mm on Wednesday, moderate to heavy rains have been lashing the city from Thursday morning.

హైదరాబాద్ పరిసర ప్రాంత జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షం..

Posted: 07/23/2020 12:17 PM IST
Monsoon picks up pace across telangana heavy rains in hyderabad

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే వుంది. ఇక ఇవాళఉదయం నుంచి వర్షం కోనసాగుతూనే వుంది. హైదరాబాదుతో పాటు వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో  ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. లింగంపల్లి, మియాపూర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట, బేంగపేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, జీడిమెట్ల, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మోమిన్‌పేటలో చిలుకవాగు, కానల వాగులు పొంగి ప్రవహిహిస్తున్నాయి.

వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా కుల్చారంలో 108 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఇవాళ, రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బుధవారం తెలంగాణలో 18.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,  గురువారం ఉదయం నుండి ఓ మోస్తారు నుంచిభారీ వర్షాలు నగరంతో పాటు పరిసర ప్రాంత జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం 9 గంటల వరకు నాంపల్లికి 39.5 మి.మీ వర్షపాతం నమోదైంది, తరువాత చార్మినార్ (36.3 మి.మీ), ఖైరతాబాద్ (23.3 మి.మీ), కీసారా (9.5 మి.మీ) వర్షపాతం నమోదైందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపింది. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులలో తెలంగాణలోని ఏకాంత ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చని సూచించింది. ఇక ఇవాళ కూడా సాయంత్రం వరకు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ సూచన తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles