Raghu Rama Krishnam Raju approches Delhi HC పార్టీ అధినేత, సీఎం జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ

Mp raghurama krishnam raju approches delhi high court

AP Police, Delhi High Court, Rama Raju, VijaySai Reddy, General Secretary, Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP MP Raghurama Krishnam Raju has approached Delhi High Court seeking Central Forces security for him to have a visit to his Narsapuram parliamentaty constituency

వైసీపీ పార్టీని నమ్మితే గొర్రె కసాయివాడిని నమ్మినట్టే: రఘురామ కృష్ణంరాజు లేఖ

Posted: 07/20/2020 05:34 PM IST
Mp raghurama krishnam raju approches delhi high court

(Image source from: Telugu.samayam.com)

వైసీపీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు తమ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను పార్టీలోకి రమ్మని ప్రాధేయపడితే కానీ తాను రాలేదని.. అలాంటిది తనపైన ఏకంగా రాష్ట్రానికి చెందిన ఓ అమాత్యుడితో కేసులు వేయించడం, తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో దూషణల పర్వానికి తెరలేపడంపై ఇదివరకే తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. తనపై విమర్శలు చేయించడానికి తన సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎంచుకుని మరీ చేయించడం విషసంస్కృతిగా ఆయన చెప్పుకోచ్చిన తరువాత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక వైసీపీ పార్టీని విశ్వసించడం గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.  

ఇక తన నియోజకవర్గంలో తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే తమకు అవగాహన ఉందని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుందని, దీనిపై కేంద్ర హోంశాఖ నిమగ్నమైందని న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం ఐబీ నివేదికలు రావాలని, వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రెండు వారాల్లో దీనిపై ఏం చేశారనేది కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.

ఈ విషయంలో ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర హోంశాఖకు కూడా ఆయన లేఖ రాశారు. అయితే ఎంపీ రాఘురామ కృష్ణంరాజుకు తాము భద్రత కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీంతో కేంద్రం కొంత జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టు ద్వారా కేంద్రానికి ఆదేశాలు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రఘురామకృష్ణం రాజు కోర్టునే ఆశ్రయించినట్లు సమాచారం. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. తనపై ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రే కేసులు పెట్టారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతోనే తనకు ఇబ్బంది ఉందని ఉందన్నారు. ఒక వేళ ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ తో భేటీ కానున్నట్లు ఎంపీ రఘురామ చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్న ఆయన.. తాను వైఎస్సార్ సీపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే సలహాలు ఇస్తున్నట్లు రఘురామ చెప్పుకొస్తున్నారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలకు ఎలాంటి గాయం కాకూడదనే తాను తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం విషయమై స్పందించానని చెప్పారు. ఈ విషయంలో తన గళం వినిపించినే కానీ.. పార్టీని కానీ, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కానీ తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు. ఈ తరుణంలో ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles