Bird spotted frozen in mid-air in mysterious video నిజంగా వింతే: గాల్లో పావురం అలా ఎలా నిలిచిపోయిందో..

Bird caught on video frozen motionless in mid air sparks alien time bubble theory

UFO sightings, Bird, frozen, air, viral video, frozen bird, bird frozen in air, hovering in mid-air, not moving, Scott Waring, aliens, birds, clean news, weird news

A bird was filmed apparently frozen mid-air in mysterious footage. The video was shot in a neighbourhood of Tuluá Valle, in Colombia. The video was first shared on Twitter by user Hechizero. It shows the white bird appearing to remain motionless with its wings spread apart in the sky above a two-storey building.

వింతల్లోకెల్లా వింత: గాల్లో పావురం అలా ఎలా నిలిచిపోయిందో..

Posted: 07/18/2020 05:22 PM IST
Bird caught on video frozen motionless in mid air sparks alien time bubble theory

పట్టపగలు ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. అలా పనిమీద రోడ్డుపై వెళ్లే కొందరు యదాలాపంగా ఆకాశం వైపు చూశారు. అలా చూస్తుండిపోయారు. వాళ్లని చూసిన మరికొందరు కూడా వాళ్లు చూస్తున్నవైపు ఆకాశంలోకి చూశారు. వాళ్లు కూడా అలాగే చూస్తుండిపోయారు తలకూడా తిప్పకుండా..వారిని ఇంకొందరు చూసి వాళ్లు కూడా ఆకాశంలోకి చూస్తుండిపోయారు.అలా ఒకరిని చూసి ఒకరు మొత్తం అందరూ దాన్నే చూస్తున్నారు. కానీ..ఎవరికీ అర్థం కావడం లేదు. అదేంటంటే..ఆకాశం మధ్యలో మధ్యలో ఒక తెల్లని పక్షి మంత్రం వేసినట్లు ఆగిపోయింది. రెక్కలు కూడా ఆడించకుండా అలా ఉండిపోయింది..రెక్కలు ఆడించకుండా ఓ పక్షి గాల్లో అలా ఉండిపోవటం అసాధ్యం.

కొందరు గాలిపటం ఏమో అనుకున్నారు. కెమెరాల్లోంచి జూమ్ చేసి చూశారు. బైనాక్యూలర్లతో చూశారు. అది బతికి ఉన్న పక్షేనని అందరూ అన్నారు. అనుమానం తీరని మరికొందరు టెలిస్కోపుల్లో చూశారు. అది బతికి ఉన్న అసలైన పక్షి అనే నిర్ధారణకు వచ్చారు. ఆ పక్షి నింగి మధ్యలో ఎలా ఆగిపోయిందో అర్థం కాక అందరూ తెగ ఆలోచించేశారు. జుట్టుపీక్కున్నారు. కొలంబియాలోని తులువా వేల్ పట్టణంలో గతవారం ఈ వింతను ఫోటోలు..వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి. పక్షులు ఆకాశంలో ఆగిపోవడం జరగదు. అవి నింగిలో ఉన్నాయి అంటే ఎగురుతూ ఉన్నట్టే. గద్దలు, రాబందులు వంటి పెద్ద రెక్కల గల పక్షులు కూడా ఒకే చోట గిరికీలు కొడుతు తిరుగుతుంటాయి.

పక్షి ఎగరాలంటే గాలి ఒత్తిడిని తట్టుకోవాలి.. అలా తట్టుకోవాలి అంటే రెక్కలను ఆడిస్తుండాలి.కానీ తులువాలో దీనికి భిన్నంగా పక్షి ఎగరకుండా నడి ఆకాశంలో తిష్టవేయడం మిస్టరీగా మారింది. మనుషులకు కనిపించని ఏదైనా వైరుకు అది తలుగుకుని ఉండొచ్చని కొందరు అంటున్నారు. కానీ అక్కడ ఎలాంటి వైరూ లేకపోవడం గమనించాల్సిన విషయం. 4జీ ఏంటెనాకు అతి దగ్గరలో ఆ పక్షి అలా నిలిచిపోయింది. కాదు కాదు ఆగిపోయింది. ఈ పక్షిని చూసినవారు.. ఆ వీడియోలు చూసిన వారు రకరకాల అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల అది ఆగిపోయి ఉంటుందని కొందరు.. ఏదైనా ఫ్యాన్ లాంటి వస్తువు అమర్చి రిమోట్ సాయంతో ఆపేసి ఉంటారని కొందరు ఏవేవో చెబుతున్నారు. ఏది ఏమైనా గాల్లో అలా ఉండిపోయిన పక్షి మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UFO sightings  Bird  frozen  viral videos  frozen bird  hovering in mid-air  aliens  birds  weird news  

Other Articles