Covid 19: 2602 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 2602 కేసులు.. 42 మరణాలు

Coronavirus in ap 2602 new covid 19 cases state tally crosses 40 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 40,000 Mark after 2602 new cases were reported in the last 24 hours, out of which 20,298 have so far recovered and have been discharged, while 534 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. 40 వేలు ధాటిన కేసులు.. 534 మరణాలు

Posted: 07/17/2020 06:50 PM IST
Coronavirus in ap 2602 new covid 19 cases state tally crosses 40 thousand mark

(Image source from: Telanganatoday.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు 40 వేల మార్కుకు అధిగమించాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు వెయి మార్కుకు అటు ఇటుగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఇవాళ ఏకంగా అత్యధిక స్థాయిలో రెండు వేల ఆరు వందలకు పైగా నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా 40 వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ వెయ్య సంఖ్యకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో రెండున్నర వేల సంఖ్యకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య ఏకంగా నలభై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 2602 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 40,646 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరిలో కరోనా పాజిటివ్ గా నిర్థరాణ కాగా, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో మాత్రం 2592 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఆనంతపురంలో 297, చిత్తూరు జిల్లాలో 328, తూర్పు గోదావరి జిల్లాలో 643, గుంటూరు జిల్లాలో 367, కడప జిల్లాలో 55, కృష్ణా జిల్లాలో 37, కర్నూలు 315. నెల్లూరు జిల్లాలో 127, ప్రకాశం జిల్లాలో 53 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 149, విశాఖపట్నం జిల్లాల్లో 23, విజయనగరంలో 89, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 42 మంది అసువులు బాసారు. గత 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో కరోనా బాధితులు మరణించారు. అనంతపురం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది చొప్పున మరణించారు. కర్నూలు జిల్లాలో 5, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నలుగురు చోప్పున, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 452కి చేరింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,298కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 19,814కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles