Was targeted after Rahul stepped down as party chief రాహుల్ పగ్గాలను వదలగానే నేను టార్గెట్ అయ్యాను: సచిన్ పైలట్

Sachin pilot ashok gehlot ganged up on me after rahul gandhi stepped down as congress chief

sachin pilot, Rajasthan Political Crisis, Ashok Gehlot, rajasthan crisis, Sachin pilot, ashok gehlot, AShok loyalists, Rahul Gandhi quit Congress chief, Rebel Congress leader Sachin Pilot, Sachin Pilot sacked, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan, politics

Rebel Congress leader Sachin Pilot has said last one year has been a struggle to protect his self-respect with Ashok Gehlot and his loyalists ganging up on him after Rahul Gandhi quit as the Congress chief. Sachin Pilot said, 'Rahul Gandhi is no more the Congress president. After he quit last year, Gehlot ji and his friends in AICC ganged up against me. Since then it became a struggle for protecting my self-respect.'

రాహుల్ పగ్గాలను వదలగానే నేను టార్గెట్ అయ్యాను: సచిన్ పైలట్

Posted: 07/15/2020 03:15 PM IST
Sachin pilot ashok gehlot ganged up on me after rahul gandhi stepped down as congress chief

రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత సచిన్‌ పైలట్‌ మరోసారి ఇవాళ స్పందించారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకోంది. అందుకు తగ్గట్టుగానే బీజేపి కూడా ఆయన ద్వారాలు తెరిచే వున్నాయని సంకేతాలను పంపింది. దీంతో జరగుతునన్న ప్రచారంపై తొలిసారి సచిన్‌ పైలట్ మీడియాతో మాట్లాడుతూ... తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. తాను అటువంటి ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని వివరణ ఇచ్చారు. తాను బీజేపీలో చేరట్లేదని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సచిన్‌ పేర్కొన్నారు. అయితే, సచిన్‌ తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో తాను చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్‌ పైలట్ చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారం సరికాదని, తాను బీజేపీని ఓడించడానికి తాను ఇన్నాళ్లు కష్టపడ్డానని చెప్పిన ఆయన.. అలాంటి పార్టీలో తాను ఎందుకు చేరుతానని ఎదురు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నుంచి తాను ఎలాంటి ప్రత్యేక అధికారాలను కోరుకోవడం లేదన్న ఆయన.. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు. రాజస్థాన్ అభివృద్ధికి పాటుపడుదామని అనుకుంటున్న తనను, తన అనుచరులను గెహ్లాట్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

తన వద్దకు ఫైళ్లు పంపవద్దని, తన మాట వినవద్దని అధికారులకు సూచిస్తున్నారని అన్నారు. ప్రజలకు తానిచ్చిన హామీలు నెరవేర్చకుంటే తనకు వారెలా విలువ ఇస్తారని పైలట్ ప్రశ్నించారు. బీజేపీతో కలిసి రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సచిన్ కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయిన తర్వాతి నుంచి గెహ్లాట్ మద్దతుదారులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ఏడాది కాలంగా గెహ్లాట్ తో తాను అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నానని సచిన్ వివరించారు. తనకు ఎదురైన ఇబ్బందులను గతంలో అధిష్ఠానం దూతల వద్ద ప్రస్తావించానని, గెహ్లాట్‌ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా ఎలాంటి ఫలితమూ లేకుండా పోయిందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles