corona test kit for home isolation patients స్వియనిర్భంధంలోని కరోనా పేషంట్లకు ప్రభుత్వం ఐసోలేషన్ కిట్

Telangana government to home deliver corona test kit for patients under home isolation

coronavirus, covid-19, Telangana Government, Home Isolation, isolation kit, corona patients, home delivery, medicines, masks, sanitizers, gloves, Hydrochloroquine, paracetamol tablets, anti-biotics, vitamin-C, E, D3 tablets, levocetirizine Tablets, booklet, Corona test kit, Telangana government, Eatala Rajender, Corona positive cases, COVID 19 patients, Telangana, Crime

Telangana government will soon provide corona test kit for the COVID-19 patients who are undergoing treatment their homes. The isolation kit would contain medicines, masks, sanitizers, gloves, Hydrochloroquine, paracetamol tablets, anti-biotics, vitamin-C, E, D3 tablets, levocetirizine and other tablets.

స్వియనిర్భంధంలోని కరోనా పేషంట్లకు ప్రభుత్వం ఐసోలేషన్ కిట్

Posted: 07/11/2020 05:34 PM IST
Telangana government to home deliver corona test kit for patients under home isolation

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నట్లుగానే తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వాన్ని సమర్థించుకునే విధంగా తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు చేసినా.. ఎక్కడా విమర్శల జడి మాత్రం అగడం లేదు. అటు ప్రభుత్వ చర్యలను ప్రజలు తూలనాడుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం కోసం అగచాట్లు పడాల్సి వస్తుందని వాదనలు కూడా వున్నాయి. ఇక ఇటు ప్రవేటు అసుపత్రుల్లో కరోనా వైద్యం పేరు చెబితే బెడ్లు ఖాళీగా లేవని సమాధానాలు.. ఒక వేళ వైద్యం అందించినా.. వారు వేసే బిల్లులతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న సెటైర్లు కూడా వినబడుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ అయిన ఓ డాక్టర్ వీడియోనే ఉదాహరణ. ఇక సామాన్యులకు ప్రైవేటు వైద్యం అందనిద్రాక్షగానే మారింది.

కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని గతంలో చెప్పిన ఆయన ఇకపై పెద్ద మొత్తంలో స్వాబ్‌ సేకరణ చేపడతామన్నారు. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్ లో చికిత్స చేస్తామని చెప్పారు. కాగా, అటు తమ ప్రభుత్వంపై ఇటు తన శాఖపై వస్తున్న అపవాదులను హరించేందుకు తాజాగా ప్రభుత్వం తరుణోపాయాన్ని అలోచించింది. ఈ క్రమంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు అసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే స్వియ నిర్భంధంలో వున్న రోగుల కోసం తమ వంతు సహాయం చేయడంతో పాటు వారు ఎట్టి పరిస్థితుల్లో భయటకు రాకుండా అన్ని రకాల మందులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లావ్స్ లను ఓ కిట్ రూపంలో అందిస్తోంది.

హోం ఐసోలేషన్ పొందుతున్న కరోనా బాధితుల ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. ప్రస్తుతం దాదాపు 10వేల మందికిపైగా కరోనా బాధితులు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం. వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా, రెండు మూడు రోజులు తరువాత లక్షణాలు బయటపడుతున్నాయి.. మరికొందరిలో లక్షణాలతో కోవిడ్ వెలుగులోకి వస్తోంది. ఇక కొందరికి పాజిటివ్ అని నిర్థారణ అయినా లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో స్వియ నిర్బంధంలోకి వెళ్తున్న బాధితులు.. మందులను వాడుతున్నారు. అయితే వాటిని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడాలి అన్న విషయాలు తెలియకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంటోంది.

ఇక పాజిటివ్ బాధితులే మెడికల్ షాపులకు వెళ్లి మందులను కొనుక్కొని సామూహిక వ్యాప్తికి కూడా కారణమవుతున్నారు. అంతేకాదు మందులను ఎక్కువ డోస్ వేసుకున్నా.. లేక తక్కువ వేసుకున్నా అది ఫలితాలను ఇవ్వకపోగా దుష్పలితాలకు దారి తీసి.. ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. దీంతో హోం ఐసోలేషన్ బాధితులు అనుభవిస్తున్న ఈ అవస్థలన్నింటిని దృష్టిలో పెట్టుకుని వారి దగ్గరికే ఔషధాలను అందించాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. కరోనా లక్షణాలు ఉన్నవారు 15 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి, అందుకు తగ్గట్టుగానే కిట్ లో ఔషధాలు, వస్తువులు సమకూర్చుతోంది ప్రభుత్వం.

హోం ఐసోలేషన్ కిట్ లో ఉండేవివే..

 

* ఔషధాలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు

* లివోసెటిరిజైన్

* ఎసిడిటీని తగ్గించే మాత్రలు

* కరోనాపై అవగాహన పెంచే పుస్తకం

* హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు

* పారాసెటమాల్ మాత్రలు

* యాంటీ బయాటిక్స్

* విటమిన్ సీ, ఈ, డీ3 మాత్రలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles