Shock to Indian medicine students in Chinese campuses చైనాలో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులకు షాక్.!

Shock to indian medicine students in chinese campuses

medicine student, house surgeon, 6yrs course, china, india government, china mbbs, china medicine course, Indian Students in Chinese Universities, Indian Students in China, Indian students, indian student in china, Indian student, Indian mbbs students in china

Clouds of uncertainity continue to hang over Indian students who returned from China due to COVID-19 in mid-February as they see no signs of going back to their campuses anytime soon due to border dispute between the two countries.

చైనాలో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులకు షాక్.!

Posted: 07/10/2020 04:02 PM IST
Shock to indian medicine students in chinese campuses

భారత నియంత్రణ రేఖ వద్దకు చోచ్చుకోచ్చి.. భద్రతా దళాలపై దొంగదెబ్బ తీసి సుమారు 20 మంది ప్రాణాలను హరించిన చైనాతో తాడో పేడో తేల్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు స్నేహహస్తాన్ని అందించి భారత్ కు తోడుగా మేమున్నామని ప్రకటించడంతో డ్రాగన్ దేశం వెనకంజ వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ లపై నిషేధాన్ని విధించిన భారత్.. ఇక తాజాగా మరో అడుగు వేసింది. భారతీయ విద్యార్థులెవ్వరూ చైనాకు వెళ్లి మెడిసిన్ చేసే వీలు లేకుండా ఆ రూపంగానూ భారత్ కరెన్సీ చైనాకు వెళ్లకుండా అడుగులు వేసింది.

వివిధ దేశాల్లో వ్యాపారాలు, వాణిజ్యాలు చేస్తున్న చైనా తన పోరుగు దేశాలపై అదిపత్యం చలాయించి.. విస్తరణ వాదానికి తెరతీస్తూ.. అదునిక ప్రపంచంలోనూ ఇంకా పాత రాచరికపు అలవాట్లు వదులుకోవాలని ఈ క్రమంలో చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులకు మన దేశంలో ‘హౌస్‌ సర్జన్‌ గా చేసేందుకు కేంద్రం అనుమతులను నిరాకరించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ రాసే అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది. కేంద్రం అర్ధంతరంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల వారూ ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. ప్రతి ఏడాది సుమారు 4-5 వేల మంది అక్కడ ప్రవేశాలు పొందుతున్నారు. రష్యా, ఉక్రెయిన్‌, బల్గేరియా, ఫిలిఫైన్స్‌, ఇతర దేశాల్లో ఎంబీబీఎస్‌ కోర్సు ఆరేళ్లు. చేరిన విద్యా సంస్థల్లోనే ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన అనంతరం కేంద్రం నిర్వహించే ‘ఎఫ్‌ఎంజీఈ’లో విద్యార్థులు అర్హత సాధించి ఏడాదిపాటు హౌస్‌సర్జన్‌ భారతదేశంలో చేయాలి. చైనాలోనూ ఎంబీబీఎస్‌ ఆరేళ్లు. అయితే తొలి అయిదేళ్లు పూర్తయిన తర్వాత చివరి ఏడాది హౌస్‌సర్జన్‌ ఇండియాలో చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇకపై ఆ వెసులుబాటు ఉండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles