Kannada actor Susheel Gowda found dead సినీపరిశ్రమలో విషాదం.. మరో యువనటుడి ఆత్మహత్య

Kannada tv actor susheel gowda dies by suicide at 30

sushil gowda, kannada actor, sushil, suicide, susheel gowda suicide, susheel gowda dead, susheel gowda death, susheel gowda, kannada movies, kannada film industry, susheel gowda death, Anthapura, Salaga, Duniya vijay, Sandalwood

Kannada actor Susheel Gowda was found dead at his residence in Mandya district in Karnataka. The exact reason for the 30-year-old’s death is still not known, and police are investigating, according to the sources. Also a fitness trainer, he had acted in a television serial and in an upcoming movie Salaga which has Duniya Vijay in the leading role.

సినీపరిశ్రమలో విషాదం.. మరో యువనటుడి ఆత్మహత్య

Posted: 07/09/2020 10:52 AM IST
Kannada tv actor susheel gowda dies by suicide at 30

సినీ పరిశ్రమలో బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అకస్మిక మరణం అంతులేని విషాదాన్ని నింపడాన్ని అటు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు ఇటు సినీ అభిమానులు కూడా మర్చిపోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. సినీరంగంపై కరోనా మహమ్మారి ప్రభావంతో అర్థిక ఇబ్బందులకు గురయ్యారో లేక షూటింగ్ లు లేక ఒత్తిళ్లకు గురయ్యారో తెలియదు కానీ ఉజ్వల భవిష్యత్ వున్న యువ కథనాయకులు, యువ నటులు అకస్మికంగా తమ అభిమానులను, అందమైన పరిశ్రమను వదలి తిరిగిరాని లోకాలకు తరలివెళ్తున్నారు. తాజాగా కన్నడ సినీపరిశ్రమకు చెందిన శాండిల్ వుడ్ నటుడు ఆకస్మిక మరణం అక్కడ విషాదాన్ని నింపింది.

కన్నడ క్యారెక్టర్ అర్టిస్ట్, బుల్లితెర నటుడు, ఫిట్ నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాటం ఒక్కసారిగా శాండిల్ వుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఫై ఏళ్ల సుశీల్.. కన్నడ సిరియల్ అంతుపురాలో నటించి మెప్పించి కన్నడ బుల్లితెర ప్రేక్షకాధరణను సోంతం చేసుకున్నారు. మండ్యలోని తన స్వగృహంలో ఆత్మహత్య పాల్పడ్డారు. ఆయన మరణవార్తతో కన్నడ సినీపరిశ్రమలో విషాదం అలుముకుంది. కన్నడ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే సుశీల్ గౌడ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు మండ్య ఎస్పీ తెలిపారు.

స్వతహాగా ఫిట్ నెస్ ట్రైనర్ అయిన సుశీల్ దునియా విజయ్ హీరోగా నటించిన సలాగా చిత్రంలో పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఆయన నటించిన చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో యువ నటుడు అకాల మరణవార్త చిత్ర యూనిట్ ను కూడా విషాదంలో ముంచింది. సుశీల్‌ మృతి పట్ల ‘సలగ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దునియ విజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుశీల్‌ ఆత్మహత్యకు కారణం ఏదైనప్పటికీ.. ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఎప్పటికైనా కన్నడ చిత్రసీమలో టాప్‌ హీరో కావాల్సిన వ్యక్తి ఇలా తమను వదిలివెళ్లిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles