Lockdown fears spike liquor sales తెలంగాణలో జోరందుకున్న మద్యం అమ్మకాలు..

Liquor sales increased in telangana amid lockdown and bonalu effect

coronavirus lockdown, Covid-19, Liquor Sales In Telangana, telangana government, Thousand crore Rupees alcohol sales in Telangana, Telangana devotees, Ujjaini Mahankali Temple, Secundrabad, Bonalu, Traditional fest, Liquor Sales,Chicken, Hyderabad Lockdown, Lockdown in Hyderabad, Lockdown in Telangana, Telanagana

In the corona crisis, non-vegetarian is no more favourite dish but liquor is the most favourite drink. People preferred liquor over non-vegetarian as alcohol sales have gone up suddenly and chicken and mutton sales dipped in July first week.

తెలంగాణలో జోరందుకున్న మద్యం అమ్మకాలు.. లాక్ డౌన్ వార్తలతో..

Posted: 07/06/2020 09:30 PM IST
Liquor sales increased in telangana amid lockdown and bonalu effect

తెలంగాణలో మధ్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు పుంజుకున్నాయి. తెలంగాణాలో విపరీతంగా విజృంబిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మరోమారు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారని, రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే క్యాబినెట్ మీట్ ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకునేలా యోచిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మద్యం బాబులు తమ మెదడుకు పదను పెట్టారు. గతంలో ఎదురైన చేధు అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు కాదు మందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో వారం రోజులుగా సేల్స్ పెరిగిపోయాయి. ఎంతలా అంటే వారం రోజుల వ్యవధిలో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగేలా.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల విజృంభన రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ దాదాపు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే అమలు చేయనున్నట్లు రూమర్లు వ్యాప్తి చెందడంతో మందుబాబులు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి జనతా కర్ఫ్యూ విధించిన మరుసటి రోజు నుంచే లాక్ డౌన్ అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.దీంతో లిక్కర్ దొరక్క నానా తంటాలు పడ్డారు. నెలల తరబడి మందు దొరక్కపోవడంతో లాక్ డౌన్ సడలించగానే ఒక్కసారిగా షాపుల మీద పడ్డారు. అప్పటికే పోరుగు రాష్ట్రాలలో మద్యం దుకాణాలు తెరచి వ్యాపారం ప్రారంభించడంతో ఇక మన రాష్ట్ర సర్కార్ కూడా ఆదాయం వైపు అడుగులు వేసింది.

హైదరాబాద్ సిటీలో కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని మద్యం బాబులు ముందుగానే మద్యం కోనుగోళ్లు చేసి ఇళ్లల్లో స్టాక్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత వారం విపరీతమైన కలెక్షన్లు వచ్చాయని వైన్ షాప్ నిర్వాహకులు అంటున్నారు. మార్చి 22 నుంచి మే 6వరకూ విధించిన లాక్ డౌన్ పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి ఇతరుల కంటే ఎక్కువగా మందుబాబులకే ముందుజాగ్రత్త ఎక్కువగా ఉందన్న సెటైర్లు వినబడుతున్నా.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటూ పెగ్గు మీద పెగ్గుకు ఎలాంటి డోకా లేకుండా పక్షం రోజులు కాదు ఏకంగా నెల రోజుల పాటు లాక్ డౌన్ పెట్టినా.. భేఫికర్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  Covid-19  Liquor Sales  Lockdown  traditional bonalu  Hyderabad  Hyderabad Lockdown  Telangana  

Other Articles