Rainfall to Lash Over Telugu States ఆల్పపీడన ప్రభావంతో.. ఇవాళ, రేపు భారీ వర్ష సూచన

Weather alert heavy rain to lash over telugu states in next 48 hours

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

Moderate to intense thunderstorm and lightning very likely over Saurashtra and Kutch, south Gujarat region, Rajastham, Madhya Pradesh, east Uttar Pradesh, Bihar, Chhattisgarh, gangetic West Bengal, Odisha, Jharkhand, Telangana and north Coastal Andhra Pradesh during the next 12 hours.

ఆల్పపీడనంగా మారిన ఆవర్తనం.. ఇవాళ, రేపు భారీ వర్ష సూచన

Posted: 07/06/2020 11:48 AM IST
Weather alert heavy rain to lash over telugu states in next 48 hours

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో దాని ప్రభావం చేత తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు (మంగళవారం) రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశాలు వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇక దీంతో పాటు రాగల రెండ్రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో నైరుతి పవనాలు చరుగ్గా కదులుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడనుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవాకశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి.

తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతోనూ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. ఇక వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు తోడు కరోనా మహమ్మారి కూడా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు తమ అరోగ్యాలను సురక్షింగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles