AP's Ex Minister Tests Positive Of Covid-19 మాజీ మంత్రి మాణిక్యాల రావుకు కరోనా పాజిటివ్

Bjp leader manikyala rao gets tested positive for covid 19

BJP leader, Manikyala Rao, COVID-19, coronavirus, coronavirus pandemic, Coronavirus positive, Covid-19 pandemic, YCP MLAs, Andhra Pradesh

BJP leader Manikyala Rao gets tested positive for Covid-19. This news broke and is creating a buzz in the Political circles. Well, He took a selfie video and doled out how he is taking care of himself staying at home. He also advised people to not worry about the positive cases and not to humiliate the people who are suffering from this disease.

మాజీ మంత్రి మాణిక్యాల రావుకు కరోనా పాజిటివ్

Posted: 07/04/2020 06:45 PM IST
Bjp leader manikyala rao gets tested positive for covid 19

దేశ విదేశాలలో పండితుల నుంచి పామరుల వరకు.. ప్రముఖల నుంచి సామాన్యుల వరకు ఎందరెందరి ప్రాణాలనో కబళించిసిన కరోనా కోటి మందికి పైగానే తన ప్రభావనికి గురిచేసింది. ఇది కేవలం గణంకాలకు ఎక్కిన లెక్కన మాత్రమే. అలా కాకుండా ఇంకా కొన్ని లక్షల సంఖ్యలో కేసులను ప్రపంచ దేశాలు దాచిపెడుతున్నాయన్న వార్తలు కూడా వినబడుతూనే వున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే కరోనా మహమ్మారి మాత్రం వీరు విఐపీ వీవీఐపీ అన్న తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. వదల బొమ్మాలీ నిన్ను వదల అంటూ మనుషలు వెంటపడి వారికి నరకాన్ని చూపుతోంది, మన దేశంలోనూ ఎంతో మంది కరోనా బారిన పడినా బయటకు చెపుకోకుండా హం క్వారంటైన్ చేస్తున్నారు.

అయితే అందోళనకు గురవుతున్న మరికోందరు ప్రముఖులు మాత్రం కరోనా రాకముందే ఐసోలేషన్ సమయంలో చేసే ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) పెంచుకునే చర్యలకు పూనుకుంటున్నారు. మరికోందరు మాత్రం కరోనాతో నో గేమ్స్.. పాజిటివ్ వచ్చిందా.. వైద్యుల పర్యవేక్షణలో దానిని తగ్గించుకుందామని ఆసుపత్రులలో చేరిపోతున్నారు. అయితే పలువురు ప్రముఖులు మాత్రం సామాన్యులకు కొంత ధైర్యాన్ని అందిస్తున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. వైరస్ కు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

తాజాగా ఏపీకి చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా సోకింది.తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, జీజేపీ నేతకు కరోనా సోకింది. ఆయనతో కారులో మాణిక్యరావు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా పరీక్ష చేయించు కోగా పాజిటివ్‌గా తేలింది. కరోనా టెస్ట్‌లో తనకు పాజిటివ్ గా తేలిందని స్వయంగా ఆయనే చెప్పారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైరస్ వ్యాపించిందనే విషయాన్ని తానే వెల్లడిస్తున్నాన్నారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకితే ఏమీ కాదని.. కానీ గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని మాణిక్యాల రావు తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, ఇతరత్రా పాటిస్తే…కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP leader  Manikyala Rao  COVID-19  coronavirus  YCP MLAs  Andhra Pradesh  

Other Articles