Pragathi Bhavan sanitized after staff member tests positive ప్రగతి భవన్ లో కరోనా కలకలం.. 15 మంది పోలీసులకు..

Telangana cm office pragathi bhavan sanitized after staff member tests positive for coronavirus

COVID-19, coronavirus, Remdesivir, police personal, camp office, Pragathi Bhavan, Begumpet, Yousufguda, first batallion, personal secretary, bereaucrat, CMO, Staff Members, Hyderabad, Telangana

An entire floor has been sealed off and sanitisation measures are underway at the Telangana Chief Minister's Office (CMO) tested positive for the coronavirus. The latest COVID-19 cases are unlikely to directly affect Chief Minister KCR as he mostly operates out of his camp office cum residence, Pragathi Bhavan, in Begumpet.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కరోనా కలకలం.. ఏకంగా 15 మందికి..

Posted: 06/27/2020 08:07 PM IST
Telangana cm office pragathi bhavan sanitized after staff member tests positive for coronavirus

(Image source from: Thehansindia.com)

తెలంగాణలో కరోనా విజృంభన యధేశ్చగా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ జిల్లాల్లో కరోనా వైరస్ జడలు విప్పి కరాళనృత్యం చేస్తోంది. తెలంగాణలోనికి కరోనా మహమ్మారిని రానీయం.. లేదా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టైనా వైరస్ వ్యాప్తి చెందకూండా చర్యలు తీసుకుంటామని సాక్షత్తు అసెంబీల్లోనే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఏకంగా కరోనా రాష్ట్రంలో తన ఉద్దృతిని కనబరుస్తోంది. ఇక తాజాగా నేరుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ నే టార్గెట్ చేసుకుని మరీ వచ్చేసింది.

జూలై లేదా ఆగస్టులో కరోనాకు వాక్సీన్ వచ్చేస్తుందని స్వయంగా ముక్యమంత్రి కేసీఆర్.. కరోనా వైరస్ గణంకాల వివరాలను రాష్ట్ర ప్రజలకు వెల్లడిస్తూ మీడియా ముఖ్యంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కరోనాకు మందును మాత్రమే ఇప్పటికీ ఫార్మ కంపెనీలు తీసుకువచ్చాయి. కానీ వాక్సీన్ రావాలంటే మాత్రం మరి కోంత సమయం పట్టనుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఈ విషయం స్పష్టం చేస్తూ వాక్సీన్ వచ్చేందుకు మరో ఏడాది కాలం పడుతుందని కూడా స్పష్టం చేసింది. కానీ కరోనా మాత్రం ఎవ్వరినీ వదలడం లేదు.. రాజకీయ సినీ క్రీడా వర్గాలు ఎవ్వరూ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని బారిన పడక తప్పడం లేదు.

తాజాగా కరోనా నేరుగా ప్రగతి భవన్ కు వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది పోలీసులకి కరోనా సోకింది. సోకిన వారిలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు, నగర పోలీసులు ఉన్నారు. బాధితులంతా కార్యాలయం బయట సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అందరికీ టెస్టులు నిర్వహిస్తున్న నేపద్యంలో 15 మంది పోలీసులకి కరోనా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలు సేకరించిన అసుపత్రులకు తరలించిన అధికార వర్గాలు.. వారి గత వారం రోజులుగా ఎవరెవరిని కలిశార్న వివరాలను కూడా సేకరించే పనిలో వున్నారు.

పాజిటివ్ గా నిర్థారణ అయిన పోలీసులందరినీ క్వారంటైన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపద్యంలో యూసుఫ్‌గూడ ఫస్ట్‌ బెటాలియన్లో మరో 11 మందికి కరోనా సోకింది. కాగా, గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. సీనియర్ అధికారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకిందని సమాచారం. ఈ నెల 7వ తేదీని కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీతో ఆయనను క్వారంటైన్ కు తరలించిన అధికారులు కార్యాలయంలో సానిటైజేషన్ చేసి.. వైరస్ ప్రభలకుండా రసాయనాలు చల్లి శుభ్రం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19  coronavirus  Remdesivir  police personal  camp office  Pragathi Bhavan  Begumpet  Hyderabad  Telangana  

Other Articles