One killed in ammonia gas leak at SPY Agros in AP నంద్యాలలో ఎస్పీవై అగ్రోస్ సంస్థలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి

One dies in ammonia gas leak at spy agro factory in nandyal ap

gas leak in Andhra Pradesh, gas leak in Kurnool, gas leak in nandyal, gas leak in spy agro industries, nandyal gas leak, kurnool gas leak, andhra pradesh gas leak. Ammonia gas, gas leak, spy agro industries, nandyal, kurnool, gas leak, kurnool, Andhra Pradesh, crime

One person died and three became ill when ammonia gas leaked from a factory in Nandyal, Andhra Pradesh on Saturday morning. The factory is owned by SPY Agro Industries Ltd. The affected people have been shifted to hospital. The victim has been identified as Srinivasa Rao, the general manager of the factory.

నంద్యాలలో ఎస్పీవై అగ్రోస్ సంస్థలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి

Posted: 06/27/2020 03:23 PM IST
One dies in ammonia gas leak at spy agro factory in nandyal ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. విశాఖ జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలీమర్స్ సంస్థ లాక్ డౌన్ ముగిసిన తరువాత పరిశ్రమను తెరిచే క్రమంలో తెల్లవారుజామునే గ్యాస్ లీక్ అయ్యి ఏకంగా 13 మందిని కబళించి.. వందలాది మందిని అస్వస్థతకు గురిచేసిన ఘటనను మరువక ముందే మరోమారు అలాంటి వార్తే వినబడటంతో రాష్ట్రం ఉలిక్కపడింది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీపై ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనతో హతాశుయులైన సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో పరిశ్రమలోని డిస్టిలరీ విభాగంలో అమోనియా నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పైప్‌ లీకేజ్‌ కారణంగా గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు గ్యాస్ పీల్చుకుని ఊపిరాడక మరణించారు. అయితే మరో ముగ్గురు మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్లీకైన సమయంలో పరిశ్రమలో కేవలం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే గ్యాస్ లీక్ కాగానే మేనేజర్ మినహా మిగిలిన నలుగురు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయినా ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.

గ్యాస్ లీక్ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలో్కి దిగారు. వీరితో పాటు జిల్లా యంత్రాంగం కూడా హుటాహుటిన రంగంలోకి దిగి అస్వస్థతకు గురైనవారి స్థానిక అసుపత్రులలో చేర్పించింది. ఆర్డీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ పరిశీలించారు. గ్యాస్‌ పైప్‌ వెల్డింగ్‌ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఇక అస్వస్థతకు గురూన ముగ్గురు పరిస్థితి కూడా కుదుటపడిందని అన్నారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని అన్నారు.

(Video Source: ABN Telugu)

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ammonia gas  gas leak  spy agro industries  nandyal  kurnool  gas leak  kurnool  Andhra Pradesh  crime  

Other Articles