Petrol, diesel price increase in Delhi వరుసగా వరుసగా 21 రోజులుగా పెరుగుతున్న ఇం'ధనం'..

Petrol diesel prices increased again up to rs 11 per litre hike in 21 days

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

Delhi saw 25 and 21 paise hike petrol and diesel prices, respectively, in Delhi on Saturday. Diesel still remains costlier than petrol for the fifth consecutive day, with a litre of petrol costing Rs 80.38 and diesel Rs 80.40 in the national capital.

వాహనదారుల నిలువుదోపిడీ.. వరుసగా 21వ రోజూ పెరిగిన ఇం‘ధనం’..

Posted: 06/27/2020 12:31 PM IST
Petrol diesel prices increased again up to rs 11 per litre hike in 21 days

(Image source from: Newindianexpress.com)

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పేరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు కూడా క్రమంగా పెరుగుతూ.. ఏకంగా రెండేళ్ల గరిష్టస్థాయిని కూడా అందుకుని మరింతపైకి ఎగబాకుతున్నాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ధరలు కలుపుకుని ఏకంగా 64శాతం మేర పొందుతున్నాయని, ఇక వాహనదారుడికి మాత్రం అంతర్జాతీయ మార్కట్ ధరల లభ్దిని చేకూర్చకుండా.. వాయింపులను మాత్రం మోయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. సంస్థలు ధరల పెంపుపై వెనక్కు తగ్గడం లేదు. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 100 ప్లస్ డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. కానీ అంతర్జాతీయంగా ధరలు సాధారణంగా కొనసాగుతున్నా.. మన దేశంలో మాత్రం వరుసగా ఇరవై ఒక్క రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

గత పందోమ్మిది రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్ ధర ఏకంగా డీజిల్ ధరతో సమానంగా ఎగసింది. మరో విధంగా చెప్పాలంటే పెట్రోల్ ధరను కూడా మించిపోయింది. దేశరాజధానితో పాటు పలు నగరాల్లో.. చరిత్రలోనే తొలిసారిగా డీజిల్, పెట్రోల్ ధరల మధ్యనున్న వత్యాసం పోయి.. ఇప్పుడు ఏ పెట్రోల్, డీజిల్ ధరలు సమానంగా మారిపోయాయి. దేశరాజధాని ఢిల్లీలో ఇలాంటి పరిణామం చోటుచేసుకువడం ఇదే తొలిసారి. కాగా దేశంలో అన్ లాక్ 1.0ను జూన్ 7 నుంచి అమల్లోకి రాగా, అదే రోజు నుంచి వరుసగా ఇరవై ఒక్క రోజులుగా ఇంధన ధరలు కూడా మారుతూవస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఈ ఇరవై ఒక్క రోజులో క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వాహనదారులకు ఆ లబ్దిని కల్పించని ఇంధన సంస్థలు.. వరుసగా ఇరవై ఒక్క రోజులుగా ధరలను పెంచుతూనే వున్నాయి.

కాగా గత ఇరవై ఒక్క రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు ఇవాళ పెట్రోల్ దరపై 25పైసలు, డీజిల్ ధరపై మాత్రం 21 పైసల మేర పెంపును విధించింది. డీజిల్ ధర పెంపుతో నిత్యావసర సరుకులతో పాటు ప్రజారవాణ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపి తద్వారా వాటి చార్జీలు పెరుగుతున్నా.. కేంద్రంతో పాటు ఇంధన సంస్థలు మాత్రం డీజీల్ ధరలకు రెక్కలు తొడిగే ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ పై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసలు మేర రూపాయలు ధర పెరగ్గా, డీజిల్ పై పది రూపాయల ఇరవై ఏడు పైసల మేర దర పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి.

కరోనా కష్టకాలంలో ప్రజలు, మరీ ముఖ్యంగా వాహనదారులు డబ్బులు లేక, జీతాలు రాక, ఉపాధి లభ్యం కాక.. నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చిన తరుణంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు పది రూపాయల మేర పెంచడం వాహానదారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు వరుసగా ఇరవై ఒక్క రోజు నుంచి పెరుగుతున్న ధరలు నిత్యావసర సరుకులపై ప్రభావం చూపుతోంది. ఈ నెల 1న లీటరు పెట్రోల్ ధర 71.26గా నమోదు కాగా, తాజాగా ఈ ధర 80.38కి చేరింది. అటు డీజీల్ ధర కూడా 69.39 నుంచి 80.40కి చేరింది.

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ.80.38 పైసలు మరియు డీజిల్ ధర రూ. 80.40 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.87.14కి, డీజిల్‌ 78.71 పైసలకు, కోల్ కతాలో లీటరు పెట్రోలు రూ.82.05, డీజిల్ ధర రూ. 75.52కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 83.59 డీజిల్ రూ. 77.61కు పెరుగగా, బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.82.99 పైసలకు చేరగా, డీజిల్ ధర లీటరకు రూ. 76.45 చేరింది. ఇక ఇటు హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా 26 పైసలు ధర పెరిగి రూ.83.44కు, డీజిల్ ధర 21 పైసలు పెరుగుదలతో రూ.78.57కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.83.85కు చేరింది. డీజిల్‌ ధర కూడా 24 పైసలు పెరుగుదలతో రూ.78.94కు ఎగసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles