International Flights Remain Suspended Till July 15 అంతర్జాతీయ విమానాలు సర్వీసులు జూలై 15 వరకు రద్దు

International flights remain suspended till july 15 says government

international commercial flights, aviation news, civil aviation, DGCA, International flights, international routes suspended, Civil Aviation Minister, Hardeep Singh Puri, domestic flights, Lockdown, Coronavirus, Flights, Air Travel, international flights, civil aviation, dgca, international news, national news

Commercial international flights to and from India shall stay suspended till July 15, civil aviation watchdog DGCA has announced. The restriction will not apply to international cargo operations and flights specifically approved by the aviation regulator.

అంతర్జాతీయ విమానాలు సర్వీసులు జూలై 15 వరకు రద్దు

Posted: 06/26/2020 09:51 PM IST
International flights remain suspended till july 15 says government

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కేంద్ర రైల్వేశాఖ బాటలోనే విమానయానశాఖ కూడా పయనిస్తోంది. సాధారణ ప్రయాణికులకు మెయిల్, ఎక్స్ ప్రెస్; ప్యాసింజర్, సబర్బన్ రైళ్లను రద్దు ఆగస్టు 12వ తేదీ వరకు రద్దు చేసిన రైల్వేశాఖ అడుగుజాడల్లోనే విమానయాన మంత్రిత్వ శాఖ కూడా పయనిస్తూ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రితం రోజున జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్ల ప్రయాణాలు అందుబాటులో వుండవని స్పష్టం చేసింది. ఇక ఈ మధ్యకాలంలో ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు అవుతాయని రైల్వే బోర్డు ప్రకటనలో వెల్లడించింది.

తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును మరికోంత కాలం పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30తో ముగుస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును మరోమారు జులై 15 వరకు పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని స్పష్టంచేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 23 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయగా, మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను కేంద్రం కొనసాగిస్తోంది.

ఇక అటు రైల్వే సర్వీసులు విషయంలో మాత్రం మార్చిలో విధించిన లాక్ డౌన్‌ నుంచి నిలిచిపోయిన సేవలు ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్‌ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్‌డౌన్‌ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వసల కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles