Delhi on high alert ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. దేశరాజధానిలో హైఅలెర్ట్

Delhi on high alert after intelligence inputs about terror threat

delhi city news, delhi on high alert, delhi terror alert, delhi terror attack, delhi police, Jammu and kashmir, High Alert, delhi police forces, Delhi Police, Delhi on high alert

The Delhi Police has been put on high alert following intelligence inputs about a probable terror threat to the national capital, sources said. Intelligence agencies have alerted police on the possibility of four to five men entering the national capital with an intention to carry out a terror attack, they said.

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. దేశరాజధానిలో హైఅలెర్ట్

Posted: 06/22/2020 06:19 PM IST
Delhi on high alert after intelligence inputs about terror threat

దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని నగరంలో ఉగ్రవాదులు దుశర్చలకు పాల్పడే అవకాశాలు వున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సహా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ మేరకు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్‌ నుంచి నలుగురు, ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు కుట్రపన్నుతూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తమ ముష్కరమూకలకు చెందిన ఉగ్రవాదులను పంపించాయన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

తీవ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీలోనికి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పరిధిలోని పదిహేను జిల్లాలలో హైఅలర్ట్ ప్రకటించారు. దీనికితోడు క్రైం బ్రాంచ్ పోలసీుల, స్పెషల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి అణువణువూ గాలిస్తున్నారు. దేశరాజధానిలో విధ్వంసం సృష్టించాలన్న కుట్రతో ఉగ్రవాదులు వచ్చే అవకాశముందని అన్నారు. ఢిల్లీ పోలీసులు అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాల సరిహద్దుల్లో విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో  ఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, గెస్ట్ హౌస్ లు, ఇతర ప్రదేశాల్లో భద్రతాచర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles