Glenmark drug for mild Covid patients hits market కరోనా రోగులకు గ్లెన్ మార్క్ ఔషధం రెడీ.. ధర ఎంతంటే..

Glenmark launches covid 19 medicine fabiflu at rs 103 a tablet

Coronavirus Vaccine, Coronavirus First Oral Drug, Coronavirus, Glenmark Pharmaceuticals, Drugs Controller General, Baddi facility, active pharmaceutical ingredient, Himachal Pradesh, Favipiravir, multiple sclerosis, Covid-19 Infections, Union Health Ministry

Oral antiviral drug favipiravir will be available in the Indian market under the brand name FabiFlu at Rs 103 for a tablet from Glenmark Pharma that secured the drug regulator's nod on Friday to manufacture and market the drug in India. It will be used to treat patients with mild to moderate Covid-19 infection.

ITEMVIDEOS: కరోనా రోగులకు ఔషధం రెడీ.. గ్లెన్ మార్క్ అవిష్కరణ.. ధర ఎంతంటే..

Posted: 06/20/2020 09:14 PM IST
Glenmark launches covid 19 medicine fabiflu at rs 103 a tablet

ప్రపంచదేశాలను గత కొన్ని నెలలుగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించేందుకు కూడా కారణమైంది. ఇప్పటి వరకు దీనిని నోవల్ కరోనా వైరస్ అని పిలిచారు. అందుకు కారణం ఏమంటే దానిని చికిత్స చేసేందుకు ఔషదం లేదని. ఇక అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ లక్షలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తున క్రమంలో అసుపత్రులకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. పలువురు రోగులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపి వెంటిలేటర్లు అవసరమయ్యేలా పరిస్థితికి చేరుస్తోంది. దీంతో ప్రాథమిక, మధ్యమిక దశలో వున్న కరోనా రోగులు ఆసుపత్రులలో చేరకుండా వారిని ఇంటి వద్దే చికిత్స అందించేందుకు ఇప్పుడు డాక్టర్ల చేతికి అస్త్రం లభించింది, అదే కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రణకు ఔషధం.

భారత దిగ్గజ ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు ఇవాళ వెల్లడించింది. దీంతో యావత్ భారత దేశ ప్రజలతో పాటు ప్రపంచం మొత్తంగా వున్న కరోనా వ్యాధిగ్రస్తులలో కొత్త ఆశలు చిగురించాయి. కరోనా నియంత్రణకు ఇన్నాళ్లు క్లరోక్వీన్ టాబెట్లతో పాటు రెమిడిసివిర్ మాత్రలతో వైద్యులు రోగులకు చికిత్స చేశారు, కానీ ఇకపై కరోనా మందుతోనే వారికి వేగవంతమైన చికిత్సను అందించవచ్చు. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్ మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో తమ ఔషదం క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫాబిఫ్లూ పేరిట ఈ మందును మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతులను మంజూరు చేసింది.

 

ఖరీదు కాసింత ఎక్కువే.!

 

స్వల్ప, మధ్యస్థ స్థాయి కరోనా రోగులకు చికిత్సను అందించేందుకు గ్లెన్ మార్క్ తీసుకువచ్చిన ఔషదం ఫాబిఫ్లూ కాసింత ఖరీదైనదనే చెప్పాలి. అయితే నానాటికీ పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య, మరణాల సంఖ్య నేపథ్యంలో ప్రాణం కన్నా ఏదీ ఎక్కవ కాదన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. అయితే పేద, బీద వారికి మాత్రం ఫవిపిరవిర్ మందు కొనడం, వారం నుంచి రెండు వారాల వరకు వాడటం కాసింత శక్తికి మించినదే. ఎందుకంటే ఒక్కో మాత్రం ఖరీదు ఏకంగా రూ.103. లక్షణాలు బయటపడిన వెంటనే తొలి రోజునే ఏకంగా ఉదయం, సాయంకాలల్లో తొమ్మిది చోప్పున మాత్రలను వేసుకోవాలి. ఇక మరుసటి రోజు నుంచి వ్యాధి నయం అయ్యే వరకు లేదా.. రెండు వారాల (14 రోజుల) వరకు ఉదయం, సాయంత్రాలలో రెండు చోప్పున మాత్రలు తీసుకోవాల్సి వుంటుంది. ఈ ఔషదాన్ని సాధ్యమైనంత త్వరగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్‌మార్క్‌ ఛైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా అన్నారు.

ఈ ఔషదం ఆసుపత్రులతో పాటు రీటైల్ మెడికల్ షాపులలోనూ అందుబాటులో వుంచేలా చర్యలు చేపడతామన్న సంస్థ ప్రతినిధులు.. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఫాబిఫ్లూను విక్రయించనున్నట్టు తెలిపారు. తమ సంస్థ తీసుకువచ్చిన పాబిఫ్లూనే తొలి ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) డ్రగ్ అని చెప్పిన సంస్థ.. తమ ఔషధాలతో చికిత్స ద్వారా కరోనా ఒత్తిడిని దేశ ప్రజల నుంచి తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. తమ ఫాబిప్లూ ఔషదాన్ని మధుమేహ (షుగర్), హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు సైతం వాడవచ్చన్నారు. ఈ ఔషధం కేవలం నాలుగు రోజుల్లోనే వైరల్‌ లోడ్‌ తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles