Petrol price hiked by 53 paise per litre, diesel by 64 paise వరుసగా పదకొండవ బాదేసిన ఇం‘ధర’ సంస్థలు..

In 13 days petrol diesel rates hiked by more than rs 7 per litre

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

For the 13th consecutive day today, the price of petrol went up by 56 paise a litre and that of diesel by 63 paise a litre. In these 13 days, petrol price has increased by ₹7.11 a litre and diesel price by ₹7.76 a litre (Delhi rates). Fuel prices are now at its highest level since more than a year.

రూ.7 మేర పెరిగిన ఇం‘ధర’.. పలు నగరాల్లో రూ.80 దాటిన పెట్రోల్ ధర

Posted: 06/19/2020 01:48 PM IST
In 13 days petrol diesel rates hiked by more than rs 7 per litre

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పెరుగడంతో ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ టో గత నెలలో వున్న ఇరవై డాలర్ల బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర రెట్టింపు ధర కన్నా అధికస్థాయికి చేరడంతో ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు ఏడాది గరిష్టస్థాయిని దాటి పరుగులు పెడుతున్నాయి. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 140 డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఇదే క్రమంలో వరుసగా పదమూడవ రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో ఏకంగా ఏడాది గరిష్టస్థాయికి ఇంధన ధరలు చేరుకున్నాయి. గత పదమూడు రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్ ధర ఏకంగా ఏడు రూపాయలకు చేరువలో పెరగ్గా, డీజిల్ పై ఎనమిది రూపాయల మేర పెరిగింది.

ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర హైదారాబాదులో ఏకంగా రూ.80 దాటగా, అమరావతిలో ఏకంగా రూ.81కి చేరింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్రప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత సేవలు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. ఇటు పెట్రోల్ తో పాటు ఆటు డీజీల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు కూడా పెరుగుతున్నాయి.

దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా పన్నెండవ రోజూ ధరలు పెరిగాయి. తాజాగా ఇవాళ శుకవారం నాడు లీటరు పెట్రోలుపై 56 పైసలు, లీటరు డీజిల్ పై 63 పైసల ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో గత పదమూడు రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ. 7.11 మేర.. డీజిల్ పై రూ. 7.76 మేర పెరిగినట్లయింది.

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ.78.37కి, డీజిల్ ధర రూ.77.06కు చేరగా, ముంబైలో పెట్రోల్ రూ.85.21కి, డీజిల్‌ 75.53కు, కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.80.13, డీజిల్ ధర రూ. 72.53కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 81.82. డీజిల్ రూ. 75.59కు పెరుగగా, హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 59 పైసలు పెరుగుదలతో రూ.81.36కు, డీజిల్ ధర 61 పైసలు పెరుగుదలతో రూ.75.31కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.81.76కు చేరింది. డీజిల్‌ ధర కూడా 59 పైసలు పెరుగుదలతో రూ.75.73కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 56 పైసలు పెరుగుదలతో రూ.81.36కు చేరింది. డీజిల్ ధర కూడా 59 పైసలు పెరుగుదలతో రూ.75.36కు ఎగసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles