12,881 Coronavirus Cases In India In Biggest 24-Hour Jump దేశంలో 24 గంటల్లో 12 వేల కేసులు,, 334 మరణాలు..

Coronavirus update biggest jump in a day over 12000 fresh cases tally tops 3 6 lakh

Coronavirus in india, coronavirus india news, coronavirus latest news, coronavirus news, coronavirus news today, coronavirus update, coronavirus, india, coronavirus cases in india, coronavirus deaths in india, health ministry, Maharashtra, Delhi

India has reported 12,881 coronavirus cases in the last 24 hours in the biggest one-day spike. Government data shows the highly infectious disease has claimed 334 lives in the last 24 hours. India has so far reported 3,66,946 coronavirus cases, of which 1,94,325 have recovered; the recovery rate is 52.95 per cent. A total of 12,237 have died till now.

కరోనా విజృంభభన: 24 గంటల్లో 12 వేల కేసులు, 334 మరణాలు..

Posted: 06/18/2020 12:47 PM IST
Coronavirus update biggest jump in a day over 12000 fresh cases tally tops 3 6 lakh

(Image source from: Timesofindia.indiatimes.com)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే మరోవైపు దేశంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. కాగా క్రితం రోజు వరకు పదివేలకు చేరువలో నమోదైన మరణాల సంఖ్య కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా పన్నెండు వేలకు చేరుకు చేరడంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఎనమిదవ దేశంగా నిలిచింది.

గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. వారం ప్రారంభంలో ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా ఇవాళ దేశంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏకంగా మూడున్నర లక్షలకు కేసుల సంఖ్య ఎగబాకింది. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు రెండు వందలకు పైబడిన సంఖ్యలో మరణాలు నమోదు అయ్యే మరణాలు గడిచిన 24 గంటల్లో ఏకంగా అత్యధిక సంఖ్యలో మునుపెన్నడూ లేని సంఖ్యలో 12వేల 883 కేసులు నమోదయ్యాయి.

దేశంలో అన్ లాక్ 1.0 అమల్లోకి రావడంతో స్థంభించిన జనజీవనానికి చలనం వచ్చింది. కేవలం మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాల తలుపులు తెరుచుకున్నాయి, దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 12,883 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 366,946 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలోనే నమోదయ్యాయి, వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలలోనూ తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 334 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పన్నెండు వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 366,946 కేసులు నమోదుకాగా, 12.237 మరణాలు సంభవించాయి.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,86.935 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,60,384 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో యాభై రెండు శాతానికి పైగా చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రలో ఏకంగా లక్ష మార్కును దాటి కరోనా కేసులు నమోదువుతున్నాయి, తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 3300 కేసులు నమోదుకాగా, 114 మరణాలు సంభవించాయి, దేశఆర్థిక రాజధాని ముంబైలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదు కావడం గమనార్హం. ఇక తాజా మరణాలతో మహారాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,16,752 నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles