Final goal: Teammates give an emotional tribute to footballer కంటతడి పెట్టించే వీడియో: ఆటగాడికి మిత్రుల నిజమైన నివాళి..

Teammates help 16 year old dead boy score one last goal viral video leaves twitter teary eyed

viral video, mexico, mexico murders, mexico boy murdered by police, death of 16-year-old boy, football videos, Dead 16 year old footballer coffin, Coffin dead footballer tribute, Teammates tribute to dead footballer, Teammates pay tribute to dead footballer, Coffin dead footballer tribute, 16 year old boy, young footballer, mexican football player, Coffin, football ground, Teammates, tribute, Mexico, viral video, social media

In a touching tribute to a 16-year-old Mexican-American teenager, his teammates at a junior football club let him score a final goal ahead of his funeral. The sad, yet poignant moment was caught on camera and is now going viral. Alexander Martínez Gómez was shot in the head by the police in southern Mexico in an alleged case of mistaken identity.

ITEMVIDEOS: కంటతడి పెట్టించే వీడియో: ఆటగాడికి మిత్రుల నిజమైన నివాళి..

Posted: 06/15/2020 04:54 PM IST
Teammates help 16 year old dead boy score one last goal viral video leaves twitter teary eyed

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం వింత నాటకం.. అని ఎందరో కవులు అన్నా.. ఆ అనుబంధాలు, ఆత్మీయతలో ఓటమిని చూసిన వారి మాటలే అవి అని చెప్పకతప్పదు. బంధాలు అనుబంధాలు.. ఎంతలా ప్రభావం చూపుతాయో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మనిషన్నవాడు తనలోని భావోద్వేగానికి గురై ఎక్కడైనా కన్నీళ్లు పెట్టుకుంటాడన్నది ఈ సత్యం తెలుపుతోంది. అవి సంతోషంతో తక్కువ సార్లు వస్తే.. బాధతో మాత్రం ఎక్కువ సార్లు కట్టలు తెంచుకుంటాయన్నది వాస్తవం. ఇలా ఒక్క సహచరుడి కోసం ఓ జట్టు పెట్టుకున్న కన్నీళ్లు.. ఆ వీడియోను చూసినవారందరికీ కంటతడి పెట్టిస్తోంది. భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఫుట్‌బాల్‌ ఆటే ప్రాణంగా బతికిన ఓ కుర్రాడు ఇటీవల మృతి చెందాడు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు మెక్సికో దేశానికి చెందిన ఉభయ పౌరసత్వం కలిగియున్న అలెగ్జాండర్‌ మార్టినేజ్‌ అనే యువకుడు నాలుగేళ్ల క్రితమే అమెరికా నుంచి మెక్సికోకు వచ్చాడు. అక్కడ తన స్నేహితులందరితో కలసిమెలసి ఫుట్ బాట్ ను ఆగాడు. ఆటలో కూడా చాలా చురుగ్గా పాల్గోంటూ రాణించిన యువకుడు ఓ రోజు రాత్రి సోడాను కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అకారణంగా పోలీసులు అతడ్ని షూట్ చేసి చంపేశారన్న అరోపణలు వినిపించాయి. అయితే అకస్మాత్తుగా తమ మిత్రుడు అలెగ్జాండర్‌ మార్టినేజ్‌ శవంగా మారిడంతో ఆయన ప్రాతినిధ్యం వహించే ఫుట్ బాల్ జట్టు శోకసంధ్రంలో మునిగింది.

దీంతో అతడి స్నేహితులు అతనికి గణంగా నివాళి ఘటించారు. అదెలా అంటే శవపేటికలో మార్టినెజ్ మృతదేహాన్ని తీసుకొచ్చి మైదానంలోనే కాసేపు పెట్టారు. గోల్ కోర్టుకు ఎదురుగా శవపేటికను పెట్టి ఒకరు ఫుట్ బాల్‌ను కిక్‌ చేయగా అది శవపేటికకు తగిలింది. అంతే అది నేరుగా గోల్ పోస్ట్‌లోకి వెళ్లింది. ఫుట్ బాల్‌ అంటే ప్రాణంగా బతికిన ఆ కుర్రాడి మృతదేహం ఉన్న శవపేటికను తాకినా ఆ బాల్ ‌గోల్ పోస్ట్‌కి వెళ్లింది. దీంతో అతడి స్నేహితులు కన్నీరు ఆపుకోలేకపోయారు. ఇలా మృతిచెందిన తమ స్నేహితుడితో చివరి గోల్ ను చేయించారు.

బంతి గోల్ కోర్టులోకి వెళ్లగానే పరుగెత్తుకుంటూ వచ్చి అతని శవపేటికపై పడి గట్టిగా ఏడ్చాశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట్లోని నెటిజన్లతోనూ కంటతడి పెట్టిస్తోంది. మార్టినేజ్ చివరి గోల్‌ వేశాడని.. లేదు.. నేను నిజంగా ఏడవడం లేదు.. అంటూ మరోకరు.. మార్టినేజ్ కు మిత్రుల ఘన నివాళి, యువక్రీడాకారుడికి యువకులు నివాళి.. కన్నీళ్లు పెట్టించిన ఘననివాళి అంటూ నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు.  ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles