Trump Considering Suspending H-1B Visas: Report హెచ్‌-1బీ వీసాలపై వాల్ స్ట్రీట్ కథనం సంచలనం..

Trump considering suspending h 1b visas amid massive unemployment report

US President, Donald Trump, suspension of visa, employment visas, US visas suspension, Unemployment in US, H-1B, Indian IT professionals, massive unemployment in America, coronavirus pandemic, Employment Visas,h1b visa,united states visa,h1b, World news, International Politics

US President Donald Trump is considering suspending a number of employment visas including the H-1B, most sought-after among Indian IT professionals, in view of the massive unemployment in America due to the coronavirus pandemic, according to a media report.

హెచ్‌-1బీ వీసాలపై వాల్ స్ట్రీట్ కథనం సంచలనం..

Posted: 06/13/2020 04:05 PM IST
Trump considering suspending h 1b visas amid massive unemployment report

కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. దీంతో అగ్రరాజ్యవాసులకు ఉపాధి కల్పించేందుకు అమెరికాలోని పాలకవర్గం చర్యలు చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోసం వచ్చే పరదేశస్తులను కూడా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురిందింది. అంతేకాదు ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చే వారికి వీసాలను కూడా కొంతకాలం పాటు నిలిపివేయనుందని సమాచారం, ఇప్పటికే అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయామంటున్న వేళ.. అగ్రరాజ్య మరోమారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందోళన రేపుతోంది.

అగ్రరాజ్యంలో ఉంటున్న చాలా మంది భారతీయులు హెచ్‌-1బీ వీసా పోందినవారే. అయితే తాజాగా ట్రంప్‌ నిలిపివేయాలని భావిస్తున్న వీసాల్లో ఇదీ ఉందని  అమెరికా ప్రముఖ మీడియా సంస్థ ‘వాల్ స్ట్రీట్‌ జర్నల్‌’ పేర్కొంది. అయితే, ఇది అమెరికాలో ఇప్పటికే ఉంటున్నవారిపై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చునని ఆ కథనంలో వాల్ స్ట్రీట్ పేర్కోంది. అయితే ట్రంప్ ఒకవేళ ఇదే నిర్ణయంపై అమోదం తెలిపిదే మాత్రం భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కరోనా సంక్షోభంలో చాలా మంది హెచ్‌-1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయి భారత్ కు తిరిగొచ్చారు. వీరు తిరిగి వెళ్లాలన్నా.. కొత్తగా ఎవరైనా అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకున్నా కొంతకాలం పాటు సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాల్ స్ట్రీట్ కథనంపై స్పందించిన వైట్‌ హౌస్‌.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు వచ్చిన సూచనలను వైట్‌ హౌస్‌ పరిశీస్తోందని అధికార ప్రతినిధి హోగన్‌ గిడ్లే తెలిపారు. హెచ్‌-1బీ వీసాతో పాటు హెచ్‌-2బీ, జే-1, ఎల్‌-1 వీసాలు కూడా నిలిపివేయాలని సూచనలు వచ్చాయని.. దీనిపై ‘అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈవో థామస్‌ డోనో ఆందోళన వ్యక్తం చేశారని కూడా తెలిపింది. ఉద్యోగ, ఉపాధి వీసాలను నిలిపివేయడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయన లేఖలో పేర్కోన్నారని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles