Hyderabad reports 175 Corona Cases in 24 hours తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న.. 24గంటల్లో 209 కేసులు

Covid 19 update telangana reports 209 corona cases in 24 hours

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana reported 209 new cases of COVID-19 on Thursday, taking the total positive cases in the state to 4,320. Out of 209, 175 new positive cases reported were from the jurisdiction of the Greater Hyderabad Municipal Corporation (GHMC), while 33 from other districts of the state.

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న.. 24గంటల్లో 209 కేసులు

Posted: 06/12/2020 12:28 AM IST
Covid 19 update telangana reports 209 corona cases in 24 hours

(Image source from: Newindianexpress.com)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు..  మళ్లీ అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సికింద్రబాద్ మహేంద్రాహిల్స్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ కరోనా తొలి పేషంట్ గా నమోదైన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. కాగా మే 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక గత పక్షం రోజులుగా నమోదవుతున్న కేసులు తెలంగాణ వాసుల్లో అందోళనను రెకెత్తిస్తోంది.

ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులు తెలంగాణలో నమోదైన గరిష్ట కేసుల సంఖ్యగా తేలడం మరో అందోళకన విషయం. ఏకంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విలయతాండం చేస్తుండగా, అటు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ కరో్నా వైరస్ కు హాట్ హాబ్ గా మారింది. కరోనా కట్టడి చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారన్ని విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అవి జిల్లాల్లో అమలు జరుగుతున్న విదంగా నగరంలో అమలు జరగడం లేదన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

కేవలం జియాగూడ.. ఆ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిన కరోనా.. ఇక ఇప్పుడు పూర్తిగా నగరాన్ని చుట్టేసింది. దీంతో దీనిని ఎలా కట్టడి చేయాలో అన్న విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది, అంతర్జాతీయ నగరంగా ప్రసిద్దికెక్కిన హైదరాబాద్ మహానగరంలో కరోనాను కట్టడి చేయడం లేదన్న విమర్శలు కూడా అటు అధికారుల, ఇటు హెల్త్ వర్కర్లు, వైద్యులకు సవాల్ విసరుతున్నాయి. ఇదే సమయంలో కరోనా తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కూడా అధికారులకు కంటిమీద కనుకు కరవయ్యేలా చేస్తున్నాయి, దీనికి తోడు మరణాలకు కూడా అధికంగానే నమోదు కావడంలో అందోళన కలిగిస్తోన్న అంశం.

తాజాగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తంగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో సింహభాగం కేసులు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినవే కాగా, రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికులలో ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో మిగిలిన 208 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవే. ఇక ఈ కేసులలో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కేసలు 175కాగా, మిగిలిన 33 కరోనా కేసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవి. కొత్తగా నమోదైన 209 కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 4320కి చేరింది. అటు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా పెరుగతోంది. ఇవాళ ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య కూడా 165కు చేరింది.

జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 175 మందికి కరోనా సోకగా,  మేడ్చల్‌ జిల్లాలో 10 కేసులు, రంగారెడ్డిలో 7, మహబూబ్ నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మూడు చోప్పునా.. వరంగల్‌ అర్బన్‌, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరికి చొప్పునా,, కామారెడ్డి, వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,993 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,162 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 3,871 రాష్ట్రానికి చెందినవారు కాగా.. మరో 449 మంది వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చినవారిగా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles