9,996 new cases 357 deaths in 24 hours దేశంలో వరుసగా నాల్గవ రోజు నమోదైన పది వేల కేసులు..

Covid 19 cases in india rise to 2 86 lakh after record jump of 9 996 new cases in 24 hours

Coronavirus in india, coronavirus india news, coronavirus latest news, coronavirus news, coronavirus news today, coronavirus update, coronavirus, india, coronavirus cases in india, coronavirus deaths in india, health ministry, Maharashtra, Delhi

India’s tally of the coronavirus disease (Covid-19) surged to 286,579 after 9,996 new cases and 357 deaths. Health Ministry figures showed 1,40,029 patients were cured from coronavirus since the outbreak, the number of active coronavirus patients in India stood at 1,37,448 today.

దేశంలో కరోనా విజృంభన: వరుసగా నాల్గవ రోజు నమోదైన పది వేల కేసులు..

Posted: 06/11/2020 10:20 AM IST
Covid 19 cases in india rise to 2 86 lakh after record jump of 9 996 new cases in 24 hours

(Image source from: Scroll.in)

దేశంలో కరోనా విజృంభన మరింత వేగాన్ని అందుకుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావానపడిన దేశాల్లో ఐదవ స్థానంలో భారత్ నిలిచింది. వారం రోజుల క్రితం టాప్ టెన్ దేశాల జాబితాలో చేరిన భారత్.. ఇదే స్థాయిలో వ్యాప్తిని కొనసాగిస్తే మరో 24 గంటల్లో నాల్గవ స్థానంలో వున్న స్పెయిన్ దేశాన్ని కూడా అధిగమించే అవకాశముంది. దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైన తరువాత విడతల వారీగా లాక్ డౌన్ విధిస్తూ చర్యలు తీసుకుంటున్న కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు కరోనాను కీలక దశలో కట్టడి చేశాయి.  

గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. వారం ప్రారంభంలో ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం పది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత వారం రోజుల నుం దేశవ్యాప్తంగా ఏకంగా 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు రెండు వందలకు పైబడిన సంఖ్యలో మరణాలు నమోదు కావడంతో మొత్తంగా వారం రోజుల్లో ఏకంగా 2 వేలకు పైబడిన మరణాలు సంభవించడం కూడా అందోళన వ్యక్తం అవుతోంది.

ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దేశంలో అన్నింటికీ సడలింపులు వచ్చాయి. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 9985 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 286,579 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులతో ఐదో స్థానానికి చేరిన భారత్.. మరణాల్లో మాత్రం 11వ స్థానంలో నిలిచింది. దీంతో దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవిస్తూ ప్రజలను అందోళనకు గురచేస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 357 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 8000 మార్కును దాటాయి. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 8102కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో  మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,40.029 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,37,448 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే తొలిసారిగా కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి.

కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో యాభై శాతానికి పైగా చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. కాగా, చైనాను మించిన సంఖ్యలో కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో మాత్రం 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, ముంబై నగరం చైనాలోని వూహాన్ నగరాన్ని మించిన కేసులతో అందోళనకరంగా మారింది. గత వారం రోజులుగా మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం కలవరాన్ని రేపుతున్నాయి. నిన్న ఒక్క రోజునే 3235 కరోనా కేసులు.. ఏకంగా 149 మరణాలు సంభవించాయి. ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 38శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచి నమోదు కావడం.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,041కు చేరగా, ఏకంగా 3438మరణాలు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles