President Trump took shelter in White House bunker అధ్యక్ష భవనం ఎదుటకు నిరసనలు.. బంకర్లో దాక్కున్న ట్రంప్

President trump took shelter in white house bunker designated for emergencies

trump bunker, george floyd, george floyd protest, warzone bunker, trump in bunker, trump twitter, trump news, Donald trump, donald trump twitter, president donald trump, president trump, protest

Secret Service agents rushed President Donald Trump to a White House bunker as hundreds of protesters gathered outside the executive mansion, some of them throwing rocks and tugging at police barricades.

అధ్యక్ష భవనం ఎదుటకు నిరసనలు.. బంకర్లో దాక్కున్న ట్రంప్

Posted: 06/01/2020 06:03 PM IST
President trump took shelter in white house bunker designated for emergencies

అగ్రరాజ్యం అమెరికాలో ఆఫ్రికన్- అమెరికన్ జార్ఝ్ ప్లాయిడ్ మృతికి నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అంధోళను ఏకంగా దేశాధ్యక్ష భవనం వైట్ హౌస్‌ వరకూ వ్యాపించాయి. అందోళనకారుల నిరసనలతో అధ్యక్షభవం ఎదుట బీభత్సం సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను కట్టడి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దాదాపు వెయి మంది అందోళనకారులు వైట్ హౌజ్ కు ఉత్తర దివగా వున్న లాపయాట్ పార్కకు చేరుకుని నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు.

దేశప్రజల నుంచి ఇలా నిరసన వ్యక్తం కావడంతో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ భయంతో బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఒక్కడే కాదు.. పరిస్థితి అదుపు తప్పుతుందేమోనన్న భయంతో అతని ఫ్యామిలీ మొత్తాన్ని బంకర్‌కు షిఫ్ట్ చేశారు. మరోవైపు హింసాకాండ మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు విస్తరించింది. పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ తగ్గటంలేదు. నిరసకారులు గుమిగూడి రోడ్లపై తమ వాడి మృతికి న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. 'నాకు ఊపిరి ఆడటంలేదు.. మీ చర్యలతో మేం విసిగిపోయాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.

అల్లర్ల నేపథ్యంలో న్యూయార్క్‌, అట్లాంటా, డెనోవర్‌, లాస్‌ఎంజిల్స్‌, మిన్నెపొలిస్‌, ఆన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. 22 నగరాల్లో ఇప్పటివరకు 1669 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారినప్పటికీ చాలా ప్రాంతాల్లో వేలమంది శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పోలీసుల దాష్టీకానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పదేపదే ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.  హింసాత్మక నిరసనలను డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles