Mysterious sound causes panic among TN residents ఆకాశంలో వింత ధ్వనులు... ఇళ్లలోంచి బయటికి పరుగులు.!

Mysterious loud sound causes panic among residents of tirupur

sonic boom, Mysterious sound, Sulur Airbase, Bangalore, Dharapuram, Kundadam, Tirupur city, Tamilnadu, Tejas Fighter Jet, IAF

A deafening mysterious sound wave created panic among residents of Tirupur city and surrounding areas including Dharapuram and Kundadam in the district at 10.40 am on Thursday morning.

ఆకాశంలో వింత ధ్వనులు... ఇళ్లలోంచి బయటికి పరుగులు.!

Posted: 05/28/2020 09:34 PM IST
Mysterious loud sound causes panic among residents of tirupur

బెంగళూరు మహానగరంలో మొదలైన భీకర శబ్దాలు.. ఇవాళ తమిళనాడులో మళ్లీ వినిపించాయి. తిరువ్వూరు నగరంలోని స్థానికులతో పాటు దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర రెండు జిల్లాల ప్రజలకు ఈ భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక.. భూమి కంపిస్తోందేమో లేక ఆకాశం బద్దలవుతుందా.? అన్నంతగా శబ్దాలు వెలువడటంతో స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవల మే 20న బెంగుళూరు నగరంలోనూ ఆకాశం నుంచి ఇదే తరహాలో భీకర శబ్దాలు వచ్చాయి.

వాసులను పరిసరాల్లో ఆకాశం నుంచి భీకర శబ్దాలు వెలువడడం అందరికీ తెలిసిందే. అయితే ఆ శబ్దం ఓ యుద్ధ విమానం నుంచి వచ్చిన 'సోనిక్ బూమ్' అని భారత వాయుసేన వెల్లడించింది. ఈసారి అలాంటి ధ్వనులే తమిళనాడులోని తిరుప్పూరు ప్రజలను హడలెత్తించాయి. తిరుప్పూరు, కంగేయం, పల్లాదం, అరుళ్ పురం, అవినాశిపాళయం, పొంగలూరు, కోండువై, అనుప్పరపాళయం ప్రాంతాల్లో ఈ తీవ్రస్థాయి ధ్వనులు వినిపించాయి. ఆకాశం బద్ధలైందా అనేంతగా పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలోంచి బయటికి పరుగులుపెట్టారు.

కాగా తమిళనాడులోని తిరువ్వూర్ నగరంతో పాటు ధర్మపురం, కుందదామ్ జిల్లాల్లో ఈ భీకర శబ్దాలకు స్థానికులు భయాందోళన చెందారు. ఆకాశం నుంచి భీకర శబ్దాలు ఎందుకు వస్తున్నాయా.? ఏదైనా ఆకాశం నుంచి కూలి కిందపడుతోందా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. సరిగ్గా ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఈ భీకర శబ్దాలు వినిపించాయి. స్థానికంగా వున్న ఓ కాంట్రాక్టర్ కొండలను బద్దలు కొట్టడానికి డైనమైట్లు పెట్టిన సందర్భంలోనూ ఇలాంటి శబ్దాలు వినిపించాయని, అయితే ఈ సారి అంతకన్నా అధిక స్థాయిలో శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు.

భీకర శబ్దాలతో స్థానికులు భయకంపితులయ్యారు. ధర్మపురం జిల్లాలో శబ్దాల ప్రభావం తీవ్రంగా పడింది. ఆ తరువాత మల్లన్నూర్ కంగేయమ్ ప్రాంతాల్లోనూ భీకర శబ్దాలు వినిపించాయి. తాను ఈ భీకర శబ్దాలను విన్నానని, అయితే ఈ శబ్దాలు రావడానికి కారణమేంటన్న విషయం తెలియదని.. బహుశా ఈ శబ్దాలు సల్లూర్ ఎయిర్ బేస్ నుంచి ప్రయాణించిన యుద్ద విమానానిదై వుంటుందని తిరుపూర్ జిల్లా ఎస్సీ దిశా మిట్టల్ సందేహాలు వ్యక్తం చేశారు. కాగా తిరుపూర్ జిల్లా కలెక్టర్ విజయ కార్తీయేయన్ మాత్రం ప్రజలు ఈ భీకర శబ్దాలకు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ఎలాంటి వదంతులను కూడా నమ్మవద్దని తెలిపారు.

అయితే ఈ భీకర శబ్దాలు మాత్రం భారత్ అమ్ములపొదిలో సరికొత్తగా చేరి సూపర్ సోనిక్ తేజస్ అస్త్రానివని.. వాటిని ప్రయోగాత్మకంగా సూలూర్ ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుంచి ప్రయోగించడంతో అవి సృష్టించిన ధ్వనులే.. ఈ భీకర శద్దాలని ప్రజలను భయకంపితులను చేశాయని అధికారులు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన నాలుగో తరానికి చెందిన యుద్ద విమానం ఇది. ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించగలడం దీని ప్రత్యేకత. శత్రుదేశాల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోవడంతో దిట్ట. సూపర్ సోనిక్ వేగాన్ని అందుకునే సమయంలోనే తేజస్ నుంచి ఆకాశం చిల్లులు పడేలా భారీ శబ్దాలు వినిపిస్తాయి. దీన్నే 'సోనిక్ బూమ్' అంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonic boom  Mysterious sound  Tamilnadu  Tejas Fighter Jet  IAF  

Other Articles