Coronavirus: 1.45 Lakh Cases In India So Far, 4167 Deaths దేశంలో కరోనా విజృంభన.. లక్షన్నర దాటిన కేసులు..

Coronavirus update covid 19 cases in india reach 1 45 lakh 4167 deaths

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India's COVID-19 count crossed the grim milestone of 150,000-mark today. The states registered 6,387 new coronavirus cases in last 24 hours. The total number of coronavirus patients in India increased to 151,767. The total number coronavirus patients in the country stood at 1.5 Lakh. Death toll has increased to 4337.

దేశంలో కరోనా విజృంభన.. లక్షన్నర దాటిన కేసులు.. 4337 మరణాలు

Posted: 05/27/2020 02:51 PM IST
Coronavirus update covid 19 cases in india reach 1 45 lakh 4167 deaths

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30వ నుంచి (మే 18వ తేదీ నాటికి) 111 రోజుల్లో లక్ష మార్కును చేరింది. అయితే మే 18 నుంచి కరోనా కేసుల వేగం.. అంతకంతకూ పెరుగుతూ ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. కేవలం పది రోజుల వ్యవధిలో దేశంలో దేశంలో కరోనా కేసులు సంఖ్య యాభై వేలకు పెరిగింది. దీంతో పది రోజుల వ్యవధిలో యాభై వేల కేసులు నమోదు కావడం అందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ్టికి దేశంలో కరోన అంతకంతకూ పెరగుతూ ఏకంగా లక్షా యాభై వేల మార్కును దాటాయి. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ స్థానంలో నిలిచిన భారత్ పదవ స్థానానికి ఎగబాకడం కలవరపరుస్తోంది. 

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా ఆరు వేలకు పైబడిన కరోనా కేసులు నమోదయ్యాయి, 6387 కొత్త పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,51,767 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 170 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4337కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా అత్యధిక మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.

గత తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 64,426 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 83,004 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2091 కేసులు నమోదు కావడంతో పాటు 97 మంది మృత్యువాతపడ్డటం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో మూడింట ఒక్క వంతు కేసులు ఇక్కడే నమోదు కావడం.. దేశవ్యాప్తంగా లక్షా యాభై వేల కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో మాత్రమే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో కేసులు పెరగడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 54758కు చేరగా, ఏకంగా 1792 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముబైలోనే ఏకంగా ముఫై వేల కేసులు నమోదు కావడం గమనార్హం.

ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 646 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 17728కు చేరగా, 118 మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 14 వేల 465కు చేరగా, 300 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నిన్న 361 కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 14,821కి చేరగా, ఏకంగా 900 మంది అసువులు బాసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles