Middle Seats Should Be Vacant In Repatriation Flights విమానాల్లో మధ్యసీట్లను భర్తీ చేయవద్దని సుప్రీంకోర్టు అదేశాలు

Sc redflags air india s full capacity flights asks mumbai hc to decide

domestic flights, mumbai airport news, delhi airport news, domestic flights mumbai, air india, supreme court, chief justice of india, Mumbai High Court

The Supreme Court allowed national carrier Air India to operate international flight service with middle seat booking. The court was hearing a petition filed by the Centre and Air India after Bombay high court questioned why the airline was not keeping the middle seats vacant in international flights.

సుప్రీంకోర్టులో ఎయిరిండియాకు ఎదురుదెబ్బ.. మధ్యసీట్లను భర్తీచేయవద్దని ఆదేశాలు

Posted: 05/26/2020 11:57 PM IST
Sc redflags air india s full capacity flights asks mumbai hc to decide

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎయిరిండియా విమానాలకు చుక్కెదురైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన దేశీయ విమానాలతో పాటు గత కొన్ని రోజుల క్రితమే విదేశాల్లో చిక్కుకున్న భారతీయలును తీసుకువచ్చేందుకు విమానాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే విమాన ప్రయాణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడం అనేది తప్పనిసరి అని సుప్రీంకోర్టు అదేశాలను జారీ చేసింది. విదేశాలలో చిక్కుకుని నాల్గవ విడత  లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా స్వదేశానికి వస్తున్న పౌరులను సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుందని, ఈ నేపథ్యంలో బౌతిక దూరం తప్పనిసరి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పౌరవిమానయానంపై కాసింత ఘాటుగానే ప్రభుత్వాన్ని మందలించినంత పనిచేసింది అత్యున్నత న్యాయస్థానం, వాణిజ్య విమానయాన సంస్థల కన్నా పౌరుల ఆరోగ్యం గురిచి ప్రభుత్వాలు ఆందోళన చెందితే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశపౌరుల ప్రాణాల

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఇండియా వెనక్కి రప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మధ్య సీట్లను భర్తీ చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సుప్రీం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సర్వీసులను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున అవి మరింత విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : domestic flights  mumbai airport  chief justice of india  Mumbai High Court  

Other Articles