కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను పట్టి పీడించకుండా దాని వేగాన్ని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ లో భాగంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే పలువురి ఉద్యోగాలు కరోనా గాలికి ఆరిపోగా.. కొందరు మాత్రం చాలీచాలని జీతాలతో బతుకులను ఈడుస్తున్నారు. బతుకు బండిని నడిపించుకునేందుకు, భార్యపిల్లలను కాపాడుకునేందుకు ఎందరో తమ స్థాయిని మర్చి, ఏదో ఒక ఉపాధి దొరికినా చాలునని భావిస్తున్నారు. అలాంటి తరుణంలో ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు తాత్కాలిక శుభవార్తను అందించింది.
లాక్ డౌన్ నేపథ్యంలో మారిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా షాపింగ్ మాళ్లు, డిపార్ట్ మెంటల్ స్టోర్లు తెరుచుకోకపోవడంతో ఆన్ లైన్ షాషింగ్ కు గిరాకీ ఏర్పడింది. ఈ పరిణామాన్ని పసిగట్టిన అమెజాన్ తన కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే నిరుద్యోగ యువతకు తాత్కాలిక శుభవార్త. పరిస్థితులన్నీ సద్దుమణిగి లాక్ డౌన్ తరువాత మళ్లీ యధాతథ స్థితికి వచ్చేవరకు నిరుద్యోగులు అమెజాన్ లో తాత్కాలిక ఉద్యోగాలను చేసుకోవచ్చు.
కొత్తగా తీసుకునే ఉద్యోగులను అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల్లోనూ, డెలివరీ నెట్వర్క్ కేంద్రాల్లోనూ నియమించనున్నట్టు అమెజాన్ వర్గాలు తెలిపాయి. తొలి దశ లాక్ డౌన్ లో ఈ-కామర్స్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయినా, ఆపై దశల వారీగా ఆంక్షలు తొలగించడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు రెట్టించిన ఉత్సాహంతో కార్యక్షేత్రంలోకి దూకాయి. కాగా, అమెజాన్ తాజాగా 'అమెజాన్ ఫుడ్' పేరిట ఆహార డెలివరీ విభాగాన్ని కూడా ప్రారంభించడం తెలిసిందే. స్విగ్గీ, జొమాటోలకు దీటుగా 'అమెజాన్ ఫుడ్' గుర్తింపు తెచ్చుకుంటుందని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ఫుడ్ కార్యకలాపాలు బెంగళూరు వరకు పరిమితమైనా, క్రమంగా దేశంలోని ముఖ్య నగరాలకు విస్తరించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more