6000 Coronavirus Cases In India in 24 hours దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 6వేల కొత్త కేసులు

Coronavirus update highest single day spike in covid 19 cases tally reaches 1 18 lakh

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The number of daily coronavirus cases hit a new high as India reported 6088 new cases in the last 24 hours. The total number of coronavirus patients in India rose to 1,18,447. Death toll has increased to 3,583 after 148 patients passed away.

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 6 వేల కొత్త కేసులు

Posted: 05/22/2020 10:57 AM IST
Coronavirus update highest single day spike in covid 19 cases tally reaches 1 18 lakh

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన 111 రోజులకు లక్ష మార్కును చేరిన కరోనా కేసులు  ఆ తరువాత వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు లేని స్థాయిలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా భారత్ నిలవడం.. ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో పదో స్థానాన్ని అక్రమిస్తుందా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దేశంలో మూడో విడత లాక్ డౌన్ సమయంలో సగటున రోజుకు నాలుగు వేల మందికి వైరస్ వ్యాప్తి చెందగా, నాలుగో విడతలో ఈ సంఖ్య మరింతగా పెరగడం అంతోళన కలిగిస్తోంది.  

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 6088 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,18,447 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 148 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 3583కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా అత్యధిక మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.

గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 48,534 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 66,330మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి మరణిస్తున్న వారిలో మన దేశంలో 3.6శాతంగా వుందని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh