Trains that run through Telugu States తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే.. ఇవాళ్టి నుంచే రిజర్వేషన్లు..

Online booking on irctc for 200 trains delayed due to amphan

Railways, trains to run from June 1, Lockdown, IRCTC Special Trains, Secundrabad, Vijayawada, Andhra Pradesh, Online booking, Indian Railways, Social distancing, corornavirus, covid_19

The online booking of tickets, which was scheduled to begin at 10 am on Thursday, was delayed. The Railways cited Cyclone Amphan’s landfall and technical issues for the delay and said they are working to fix it.

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే.. ఇవాళ్టి నుంచే రిజర్వేషన్లు..

Posted: 05/21/2020 11:56 AM IST
Online booking on irctc for 200 trains delayed due to amphan

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన నాల్గవ విడత లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశరాజధాని ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచిన ప్రత్యేక రైళ్లు కొనసాగుతున్న తరుణంలో.. కేంద్రరైల్వే మంత్రిత్వశాఖ మరో ముందడుగు వేసింది. సామాన్యుల  ప్రయాణ సాధనం.. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే 200 రైళ్లకు పచ్చజెండా ఊపింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ రైలు ప్రయాణాలకు ఇవాళ్టి నుంచే అన్ లైన్ రిజర్వేషన్ ప్రారంభమైయ్యింది. కాగా, ఇవాళ పది గంటల నుంచి ఈ ఆన్ లైన్ రిజర్వేషన్ ప్రారంభం కావాల్సి వున్నా.. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ మొరాయించడంతో ఆలస్యమయ్యింది.

అయితే అందుకు అంఫన్ తుఫాను కారణంగానే ఈ ఆలస్యం జరిగిందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. అంఫన్ తుఫాను కారణంగా పలు సాంకేతిక అంశాలు తలెత్తడంతో పది గంటలకు ప్రారంభం కావాల్సిన తమ వెబ్ సైట్ మొరాయించిందని.. అయితే అధికారులు దానిని ఫిక్స్  చేసేందుకు సంబంధిత టెక్నికల్ బృందాలు రంగంలోకి దిగాయని పేర్కోన్నారు, ప్రస్తుతం వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్‌ మాత్రమే తిరుగుతుండగా.. జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు నడపబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా 200 నాన్- ఏసీ సెకండ్ రైళ్లు జూన్ 1వ తేది నుంచి తిరుగనున్నాయి. ఇక రిజర్వేషన్ కు జూన్ 22 వరకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు.

స్లీపర్‌ క్లాస్‌ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వడంతో రిజర్వేషన్లు పూర్తైయ్యాయి. ఇక నిర్ధేశించిన రిజర్వేషన్ టికెట్లు పూర్తైన తరువాత టికెట్లు వెయిటింగ్‌ లిస్టుకు చేరిపోయాయి. కేటాయించిన టికెట్లు పూర్తయిన తర్వాత 200వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లకు అవకాశం కల్పిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని రైల్వే శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కోంది. ఆరోగ్య సేతు అప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని కూడా సూచించింది. ప్రస్తుతం స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్లకు అనుమతించారు. రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయని అధికారులు వెల్లడించారు.

రోజూవారి తిరిగే రైళ్లు
* (02701/02) ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌
* (02703/04) హావ్‌డా- సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌
* (02723/24) హైదరాబాద్‌- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌
* (02791/92) దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌
* (02805/06) విశాఖపట్నం- ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌
* (07201/02) గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌
* (02793/94) తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌
* (02727/28) హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌
* (01019/20) ముంబయి సీఎస్‌టీ- భువనేశ్వర్‌ (వయా సికింద్రాబాద్‌, విజయవాడ) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌

** (02245/46) హావ్‌డా-యశ్వంత్‌పూర్‌ (వయా విజయవాడ) (వారానికి ఐదు రోజులు నడిచే దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లు)
** (02285/86) సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ (వారానికి రెండుసార్లు నడిచే దురంతో రైళ్లు)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles