ap high court on doctor sudhakar issue డాక్టర్ సుధాకర్ ను హాజరుపర్చండీ: ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు అదేశం

Ap high court order s government to produce doctor sudhakar in the court

AP High Court, Doctor Sudhakar, TDP, Vangalapudi Anitha, Anesthesiologist, AP Advocate General, Sri Ram, Andhra Pradesh, Politics

Andhra Pradesh High Court takes up Anesthesiologist issue order's government to produce Dr sudhakar in the court

డాక్టర్ సుధాకర్ ను హాజరుపర్చండీ: ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు అదేశం

Posted: 05/19/2020 01:42 PM IST
Ap high court order s government to produce doctor sudhakar in the court

విశాఖపట్టణానికి చెందిన అనెస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆక్షేపించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. బాధిత డాక్టర్ ను తమ ఎదుట హాజరుపర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని అదేశించింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ ను దాఖలు చేయాలని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ను అదేశించింది. డాక్టర్ సుదాకర్ కేసులో వీడియో క్లిప్పింగును జతచేస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ పిల్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

రాష్ట్ర హైకోర్టు ఈ వీడియోను సుమోటో పిల్ గా స్వీకరించి.. విచారణ చేపట్టన క్రమంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ డాక్టర్ సుధాకర్ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు. హైకోర్టుకు అనిత పంపినది ఎడిట్ చేసిన వీడియో అని.. ప్రధానిని, ముఖ్యమంత్రిని సుధాకర్ దూషించిన వీడియోలను లేఖతో ఎందుకు జతచేయలేదని ప్రశ్నించారు. డాక్టర్ వ్యవహారం రాజకీయ రంగు పులుపుకుందని, ఈ కేసు విచారణను కూడా రాజకీయం చేసేందుకు పార్టీలు యత్రిస్తున్నాయని ఆయన తన వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో డాక్టరు సుధాకర్ పట్ల దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్ ను ఇప్పటికే సస్పెండ్ అయినట్టు వివరించారు. కాగా ఇదే కేసులో గతంలో పోలీసులు వివరిస్తూ పూర్తిగా పీకల వరకు మద్యం సేవించిన ప్రభావంతో వున్న డాక్టర్ దూషనల పర్వాన్ని అందుకోవడంతో ఆయనను నియంత్రించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో చేతులు వెనక్కు కట్టి నిలువరించినట్టు చెప్పుకోచ్చారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అనుమానుషంగా ప్రవర్తించారని, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సీహెచ్ వెంటకేశ్వర్లు హైకోర్టులో పిల్ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles