Woman jumps to death from multi storied building in hyderabad ‘‘అమ్మా.. అక్క, పిల్లలను చూడాలని వుందమ్మా.. ’’

Woman jumps to death from multi storied building in hyderabad

young girl, house maid, Lanco HIlls, 15 floor suicide, Manikonda suicide, Raidurgam police, Krishna district, Cyberabad Police, Telangana, Andhra Pradesh, Crime

A woman allegedly committed suicide by jumping from a multi-storied apartment in Manikonda of Raidurgam here on Wednesday morning. The victim, identified as Mallika, a private employee from Nandigama, came to Hyderabad three months ago.

లాక్ డౌన్ లో రావద్దూ.. అన్నందుకు మనస్తాపంతో యువతి..

Posted: 05/13/2020 11:51 AM IST
Woman jumps to death from multi storied building in hyderabad

పల్లెటూరి పిల్ల.. పట్టణానికి వస్తేనే అయోమయంగా వుంటుంది.. ఇక మహానగరానికి వస్తే.. అ వెంటనే గత మూడు నాలుగు తరాల ప్రజలు ఎన్నడూ చూడని పరిస్థితులు ఉత్పన్నమై.. అమెకు తన కన్నవారు గుర్తుకు వచ్చి ఊరేళ్లాలని పట్టుబట్టినా.. అనేక ప్రయత్నాలు చసి విఫలం కావడం.. ఇక తల్లిదండ్రులు కూడా అమెను స్వస్థలానికి చేరుకునే ప్రయత్నాలు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు చేయవద్దని చెప్పడంతో.. ఒంటరి గదిలో చిక్కుకుపోయి.. మానసికంగా కలత చెందిన మనస్తాపానికి గురై.. విపరీత నిర్ణయాలు తీసుకుంటే.. ఎంతటి హృదయవిదారక ఘటన.

అలాంటి ఘటనే హైదరాబాద్ మహానగరంలోని లాకో హిల్స్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం మహానగరానికి ఇంటి పనులు చేసేందకు లాకో హిల్స్ లోని ఓ ఇంట్లో పనికి కుదిరింది ఓ యువతి.. కన్నవారిని ఉన్నఊరును విడిచి తొలిసారిగా వచ్చింది. అంతే వచ్చిరాగానే కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా లాక్ డౌన్ విధించారు. దీంతో తాను పనిచేసే అపార్టుమెంటు నాలుగు గోడలే మహానగరమా.? అని భావించి.. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటిసభ్యులందరూ ఇళ్లలోనే వుండటంతో పనిభారం కూడా ఎక్కువైంది.

దీంతో తన గ్రామానికి వెళ్లలేక, తల్లిదండ్రులు రాలేక.. ధైర్యంగా వుండాలని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి వెళ్లలేకపోవటంతో గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఊర్లో ఉన్న తల్లికి ఫోన్ చేసిన వల్లిక ‘‘అమ్మా! అక్క పిల్లలను చూడాలని ఉంది’’ అని అడిగింది. లాక్‌డౌన్‌ వల్ల ఇంటికి రావటానికి కుదరదని, గ్రామంలోకి బయటవారిని కూడా రానీయడం లేదని చెప్పడంతో మనస్తాపం చెందింది. ఉదయం పనికి వెళ్లిన తర్వాత ల్యాంకో హిల్స్‌ 15వ అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వీర వల్లిక అనే యువతి, మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి, ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ,  ల్యాంకో హిల్స్ లో ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా కార్యాలయం మూత పడటంతో ఇక్కడే చిక్కుకుపోయింది. ఆమె స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ సమయంలో తనను ఎలాగైనా తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులను కోరింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles