state govt appoints High Power Commitee ఎల్జీ పాలీమర్స్ వద్ద స్థానికులు అందోళన.. ఉద్రిక్తత..

Vizag gas tragedy locals protest at lg polymers demand shifting of factory

lg polymers, lg polymers gas leakage, visakhapatnam lg polymers, HIgh Power committee, YS Jagan, visakhapatnam lg polymers gas leak, lg polymers visakhapatnam gas leak, lg polymers vizag gas leak, lg polymers gas leakage, lg polymers gas leakage news, lg polymers gas leakage latest news, lg polymers gas leakage today news, visakhapatnam lg polymers gas leakage news

Residents of RR Venkatapuram and adjoining villages in Visakhapatnam staged a protest at LG Polymers company on Saturday morning, demanding relocation of the factory out of the place.

ఎల్జీ పాలీమర్స్ వద్ద స్థానికులు అందోళన.. ఉద్రిక్తత.. డీజీపీ కాళ్లపై పడ్డ మహిళలు..

Posted: 05/09/2020 11:20 AM IST
Vizag gas tragedy locals protest at lg polymers demand shifting of factory

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి విడుదలైన రసాయన విషవాయువులతో 12 మంది మృతి చెందగా, వందలాది మంది ఆసుపత్రి పాలుకావడంతో..  ఆ సంస్థ వద్ద స్థానికులు అందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుల కుటుంబాలకు తక్షణం న్యాయచేయాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబసభ్యులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అందోళన చేపట్టారు. అంతేకాదు జనవాసాల మధ్య నుంచి ఎల్జీ పాలీమర్స్ సంస్థను తక్షణం తరలించాలని ఆర్ఆర్ వెంకటాపూర్ గ్రామంతో పాటు ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలతో సంస్థ ఎదుటే ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు తేల్చిచెబుతామన్నారు. రసాయన విషవాయువులు లీకేజీ కావడంతో తమ గ్రామస్థులు, గ్రామాలు నష్టపోతే.. నాయకులు వచ్చి పరిశ్రమలో పరిశీలిస్తున్నారని అరోపించారు. నాయకులు తమ గ్రామాల్లోకి వచ్చి బాధిత ప్రాంతాలను పరిశీలించడం లేదని అక్రోశం వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తాగునీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత గ్రామస్థులు వాపోయారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం ప్రజలకు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గ్యాస్‌ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు రావడంతో స్థానికులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంత తీవ్ర ఉద్రిక్తత నెలకోంది. డీజీపీ వచ్చేందుకు గేటు తెరవడంతో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు వలయంగా ఏర్పడి డీజీపీకి రక్షణ కల్పించారు.

ఆందోళనకారులు పరిశ్రమలోకి చొచ్చుకురావడంతో డీజీపీ వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్యాస్ లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు అతికష్టం మీద డీజీపీని అక్కడినుంచి పంపించారు. మరో వైపు డీజీపీని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌ చేస్తూ పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles