state govt appoints High Power Commitee ఎల్జీ పాలీమర్స్ విష వాయువు లీక్ పై హైపవర్ కమిటీ ఏర్పాటు

Visakhapatnam gas leak state govt appoints high power commitee

lg polymers, lg polymers gas leakage, visakhapatnam lg polymers, HIgh Power committee, YS Jagan, visakhapatnam lg polymers gas leak, lg polymers visakhapatnam gas leak, lg polymers vizag gas leak, lg polymers gas leakage, lg polymers gas leakage news, lg polymers gas leakage latest news, lg polymers gas leakage today news, visakhapatnam lg polymers gas leakage news

Chief Minister Jagan Mohan Reddy appoined High power committee to investigate on the reasons behind the Gas Leakage in LG Polymers Industry at RR venkatapuram of Visakhapatnam.

ఎల్జీ పాలీమర్స్ విష వాయువు లీక్ పై హైపవర్ కమిటీ ఏర్పాటు

Posted: 05/08/2020 11:59 AM IST
Visakhapatnam gas leak state govt appoints high power commitee

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి క్రితం రోజు తెల్లవారుజామునన విడుదలైన రసాయన విషవాయువులు స్థానికులను ఉక్కిరిబిక్కిర చేయడంతో పాటు ఏకంగా 12 మంది ప్రాణాలను కూడా బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏకంగా మరో 300 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురై అసుపత్రులలో చికిత్స పోందుతున్న విషయం కూడా తెలిసిందే. ఆదమరచి నిద్రిస్తున్న పరిసర గ్రామాల ప్రజలను.. నిద్రలోనే అస్వస్థతకు గురిచేసింది. బాధితుల్లో పలువురు కొలుకుని డిశ్చార్జి కాగా, అనేకమంది ఇప్పటికీ అసుపత్రిలో చికిత్సపోంతున్నారు. ఇక ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసింది.  

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హైపవర్‌ కమిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్ గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీయనుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను ఈ కమిటీ అన్వేషించనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం హైపవర్‌ కమిటీకి సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles