Inter second year results in June second week జూన్ రెండవ వారంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు: సబితారెడ్డి

Telangana s class x exams after hc s nod sabitha reddy

Telangana Intermediate Results in Mid-June, Telangana Intermediate Results, Telangana Intermediate Results 2020, Telanagna Education Minister, Sabitha Indra Reddy, Telangana Intermediate Results 2020, Intermediate Exams Results, Intermiediate Board, Inter results, sabitha reddy, education minister, intermiediate board, june second week, tenth exams, schools re-open, Telangana

Results of Intermediate second year examinations will be declared in the second week of June and the first year results in the third week, Education Minister P. Sabitha Indra Reddy said.

జూన్ రెండవ వారంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు: సబితారెడ్డి

Posted: 05/07/2020 09:06 PM IST
Telangana s class x exams after hc s nod sabitha reddy

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ ప్రారంభమైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనంపై ఆమె అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా 53,10,543 జవాబు పత్రాల మూల్యాకనం చేయాల్సి ఉందని, అవన్నీ ఈనెల 30వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. జూన్‌ రెండో వారంలో ద్వితీయ సంవత్సర ఫలితాలను, మూడో వారంలో ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

లాక్ డౌన్‌ తో వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ విద్యార్థులు 861 మంది ఉన్నారని, ఆ పరీక్షల నిర్వహణకు 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 12 స్పాట్‌ కేంద్రాల ఏర్పాటు చేశామని, 33 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అన్నింటా భౌతిక దూరం పాటిస్తూ ఒక్కో కేంద్రంలో 600 నుంచి 700 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

కరోనా కారణంగా నిలిపిన పదో తరగతిపరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి కోసం వేచిచూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 2,530 పదో తరగతి పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చేసే ఏర్పాట్లపై కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. పరీక్షకేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజూ కేంద్రాల్లో కెమికల్‌ శానిటైజేషన్‌ చేస్తామన్నారు. బెంచ్ కు ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టేలా చర్యలు చేపడతామన్నారు. పరీక్షల నేపథ్యంలో వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.

రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అంశంపై లాక్ డౌన్‌ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది ఫీజులే ఈ ఏడాది వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు, నెల వారీగా ఫీజులు తీసుకోవాలన్నారు. ఫీజులపై ఒకట్రెండు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా ఇతర బోర్డులకు కూడా ఈ అదేశాలు వర్తిస్తాయని చెప్పారు. ఫిర్యాదులు స్వీకరణకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు సబితారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles