8 Dead after gas leak at chemical plant in Visakha విశాఖలో విషవాయువులు.. అపస్మారకస్థితిలోకి ప్రజలు

Visakhapatnam gas leak styrene a poisonous gas could have triggered series of explosions

Visakha gas leak, liquified petroleum gas, Visakhapatnam, RR Venkatapuram, LG Polymers, energy sector, OMC, oil marketing companies, Andhra Pradesh

The styrene gas that leaked from LG Polymers which has killed at least seven people and created panic in several areas of Visakhapatnam leading to fleeing of homes in the vicinity of the plant is a poisonous, inflammable gas used in plastic engineering industry, and could have triggered a series of explosions, according to experts.

విశాఖలో విషవాయువులు.. అపస్మారకస్థితిలోకి ప్రజలు.. ఎనమిది మంది మృతి..

Posted: 05/07/2020 10:09 AM IST
Visakhapatnam gas leak styrene a poisonous gas could have triggered series of explosions

విశాఖపట్టణంలో విషవాయువులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఆదమరచి నిద్రపోతున్న సమయంలో మెల్లిగా దాదాపు ఐదు గ్రామాల పరిధిలో వ్యాప్తి చెందిన విషవాయువును పీల్చి ప్రజలు అనంతవాయులలో కలిసిపోతున్న ఘటన చోటుచేసుకుంది. విశఆఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి అత్యంత విషపూరితమైన కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.

దాదాపు 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల బాలిక ఉన్నారు. ఇక మరికోందరు పరిస్థితి కూడా విషమంగా వుందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో  పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించడంతో దానిని పీల్చిన ప్రజల ప్రాణాలు ప్రమాదం బారిన పడుతున్నాయి. కొందరికి చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.

ఉదయం లేస్తూనే ఈ విషవాయువును పీల్చిన కొందరు రోడ్డుపైనే పడిపోయారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కంపెనీని తెరిచే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కంపెనీకి ఐదు కిలోమీటర్ల  పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. ఇక వృధ్దులు, చిన్నపిల్లలున్న వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది.

గ్యాస్ లీక్ అయిన గ్రామాల పరిధిలో ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌ మోగిస్తూ స్థానికులను అప్రమత్తం చేశారు, పలువురు ఇళ్లలోనే వుండిపోయారని సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి తలుపులు బద్దలుకొట్టి మరీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, ప్రభావిత గ్రామస్థులను ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు. 25 అంబులెన్సులు, పోలీసు వాహనాలతో బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే, విధుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఓ కానిస్టేబుల్ ఈ వాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలాడు.

కానిస్టేబుల్ ను గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కేజీహెచ్‌కు తరలించారు. గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రజలను రక్షించే విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని అదేశించారు. మరికాసేపట్లో సీఎం నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles