దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తోంది. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా తన గరిష్ట సంఖ్యలో తన వేగాన్ని విస్తరించుకుంటోంది. దీంతో అనేక మంది దేశప్రజలు దాని ప్రభావం బారిన పడుతున్నారు, గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో మూడువ విడత లాక్ డౌన్ ను పలు సడలింపులతో అమల్లోకి తీసుకువచ్చిన తొలి రోజునే కరోనా కేసులు గరిష్టంగా నమోదు కావడంతో పాటు అదే స్థాయిలో మరణాలు కూడా సంభవించిడం అందోళనను రేకెత్తిస్తోంది. ఒక్కరోజులో అత్యధికంగా గరిష్ట సంఖ్యలో 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇదే ప్రథమం.
మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 46 వేల 433 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 195 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1568కు చేరడం కూడా అందోళన కలిగించే అంశం. మొత్తం బాధఇతుల్లో 12, 727 మంది కోలుకోగా 32, 138మంది మాత్రం ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు.
దేశంలో ఒక్కసారిగా కరోనా మరణాల సంఖ్య పెరగడానికి బెంగాల్ లో పెరిగిన మరణాలే కారణం. పశ్చిమబెంగాల్ లో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా సోకి చికిత్స పోందుతున్నవారిలో 98 మంది మరణించారు. కొత్తగా 296 కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో పశ్చిమబెంగాల్ లో ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 133కు చేరగా, మొత్తం కేసులు సంఖ్య 1259గా నమోదైంది. వీరిలో ఇప్పటివరకు 218 మంది కోలుకున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ లో మమత ప్రభుత్వం కరోనా మరణాలతో పాటు కేసుల నమోదులో కూడా బహిరంగపర్చడం లేదన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ లో కరోనా మరణాలు రేలు 12.8గా దేశంలోనే అత్యధికంగా నమోదుకావడం గమనార్హం.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గురికావడం, ఇప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోడం గమనార్హం. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 12,727 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. మహరాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య ఏకంగా 14 వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో 1567 కొత్త కేసులు, 35 మరణాలు సంభవించాయి. ఇక మృతుల సంఖ్య కూడా 583కు చేరింది. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more