AP Govt to not allow general public రాష్ట్రంలోని వారిని మాత్రమే అనుమతి.. ప్రభుత్వ అదేశాలు

Ap government to not allow general public expect migrant workers

migrant workers, General Public of AP, Andrha pradesh government, stranded residents, stranded labours, Andhra Pradesh

The state government has made it clear that they would only allow migrant workers of the state stranded in other places of the country as per the orders of union government. Andhra Pradesh government has decided to not allow the state residents, who have stranded in different states of the country.

రాష్ట్రంలోని వారిని మాత్రమే అనుమతి.. ప్రభుత్వ అదేశాలు

Posted: 05/04/2020 12:43 PM IST
Ap government to not allow general public expect migrant workers

మూడో విడత లాక్ డౌన్ నేపథ్యంలో పలు సడలింపులు అందుబాటులోకి రావడంతో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు మాత్రమే రాష్ట్రంలోకి రావాలని మిగిలిన వారెవరికీ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు పొరుగు రాష్ట్రాలలో వున్నవారు రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చి ఇబ్బందులు పడొద్దని పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలస కూలీలకు మాత్రమే సొంత ప్రాంతాలకు వచ్చేందుకు అనుమతి ఉందని, మిగతావారెవరికీ ఎలాంటి అనుమతి లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల వారందరికీ లాక్ డౌన్ నిబంధనలు అమలు కానున్నాయని తెలిపింది.

ఇక రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలదరినీ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకత్వాల నేపథ్యంలో ముందుగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నామని వివరించింది. దీంతో పాటు వారికి కరోనా నిర్థారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని వివరించింది. ఈ నేపథ్యంలో పోరుగు రాష్ట్రాల్లో వున్న సాధారణ ప్రజల సరిహద్దుల వద్దకు చేరుకుని ఇబ్బందులు పడవద్దని సూచించిన రాష్ట్రప్రభుత్వ అధికారులు.. ఇక వలస కూలీల సదుపాయాల కల్పన కష్టమవుతోందని.. అందుకే మిగతావారు సహకరించాలని కోరింది.

కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి పరిస్థితులను సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరమని.. అనవసర ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదముందని కూడా హెచ్చరించారు. పెద్దవాళ్లతో పాటు డైయాబెటిక్, హైపర్ టెన్షన్ రోగుల ఆరోగ్యంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు ప్రజల సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి’ అని జగన్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles