LPG sees price drop of more than Rs 160 per cylinder భారీగా తగ్గిన సబ్సీడీయేతర వంటగ్యాస్ సిలిండర్ దరలు

Lpg sees price drop of more than rs 160 per cylinder

LPG, gas prices, liquified petroleum gas, energy sector, OMC, oil marketing companies, Indane, Bharat, Hindustan

In a major relief to consumers, the price of LPG cylinders has been steeply cut by Rs 162.5 per cylinder in Delhi today. In the other parts of the country too, the oil marketing companies have slashed LPG cylinder prices. With the latest cut in prices, a 14.2 kg non-subsidised LPG cylinder would cost Rs 581.50, instead of Rs 744 with effect from today.

భారీగా తగ్గిన సబ్సీడీయేతర వంటగ్యాస్ సిలిండర్ దరలు

Posted: 05/01/2020 01:48 PM IST
Lpg sees price drop of more than rs 160 per cylinder

సబ్సీడీరహిత వంట గ్యాస్ వినియోగదారులకు మరో సారి ఊరట లభించింది. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ దరలతో పాటు లిక్విఫైడ్ ప్రెటోలియం గ్యాస్ దరలు కూడా క్రమంగా తగ్గడంలో దేశీయంగా కూడా ధరలను తగ్గిస్తూ ఇంధన మార్కెటింగ్ సంస్థలు ధరలను తగ్గించాయి, ఎల్పీజీ గ్యాస్ ధరల నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.  దీంతో ఎల్పీజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో  దిగి వచ్చాయి.

ఇక ఎల్పీజీ సిలిండర్ తగ్గింపు ధరలు ఇవాళ్టి నుంచే (మే 1) అమల్లోకి రానున్నాయని కూడా మార్కెటింగ్ సంస్థలు అదేశాలు జారీచేశాయి. కాగా కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలతో పాటు క్రూడ్ అయిల్ ధరలు కూడా గణనీయంగా తగ్గుతున్న విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా ఎల్సీజీ సిలిండర్ ధరలు తగ్గింపు జరగడం వరుసుగా ఇది మూడవ సారి కావడం గమనార్హం, ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సబ్సీడీ వంటగ్యాస్ సిలిండర్ దర రూ.744గా నమోదు కాగా తాజా సవరణలతో 207 రూపాయలు తగ్గి కేవలం 581.50కే లభించనుంది,

ఇక దేశ అర్థిక రాజధానిగా బాసిల్లుతున్న ముంబైలో సబ్సీడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర నూ. 714.50 తో  పోలిస్తే  తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో  రూ. 190 తగ్గి రూ. 584.50,  చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర‌లు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా  గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రలు మారుతూ వుంటాయి. హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 207 త‌గ్గి  రూ. 589.50 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధ‌ర రూ. 988 కి చేరింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG  gas prices  liquified petroleum gas  energy sector  OMC  oil marketing companies  Indane  Bharat  Hindustan  

Other Articles